వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దావూద్ గ్రూప్: మహిళా వింగ్, లేడీస్ టార్గెట్‌గా ఆపరేషన్స్, షాకైన పోలీసులు

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తన టీమ్‌లో మహిళల వింగ్‌ను ఏర్పాటు చేశారని నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి. మహిళలు టార్గెట్‌గా ఉన్న ఆపరేషన్స్‌ను చక్కబెట్టేందుకు లేడీస్‌ వింగ్‌ను రంగంలోకి దించే వ్యూహంతో డీ కంపెనీ ఈ విభాగాన్ని ఏర్పాటు చేసినట్టు నిఘా సంస్థలు భావిస్తున్నాయి.

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మహిళలను లక్ష్యంగా చేసుకొని లేడీస్ టీమ్‌ను ఏర్పాటు చేసుకొన్నారని నిఘా వర్గాలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి.

అండర్ వరల్డ్ డాన్‌లు మహిళలను దూరం పెడితే అందుకు భిన్నంగా దావూద్ ఇబ్రహీం వ్యవహరించారని నిఘా సంస్థలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి.అయితే వ్యూహత్మకంగానే దావూద్ ఈ టీమ్‌లను ఏర్పాటు చేశారని నిఘా సంస్థలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

దావూద్ టీమ్‌లో మహిళా వింగ్

దావూద్ టీమ్‌లో మహిళా వింగ్

అండర్‌వరల్డ్‌ మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీం తన చీకటి సామ్రాజాన్ని విస్తరించేందుకు మహిళలకూ ఎర వేస్తున్నాడు. మహిళలు టార్గెట్‌గా ఉన్న ఆపరేషన్స్‌ను చక్కబెట్టేందుకు లేడీస్‌ వింగ్‌ను రంగంలోకి దించే వ్యూహంతో డీ కంపెనీ ఈ విభాగాన్ని ఏర్పాటు చేసినట్టు నిఘా సంస్థలు భావిస్తున్నాయి.ఈ మేరకు కొన్ని ఫోన్‌కాల్స్‌ను విశ్లేషించిన నిఘా సంస్థలు ఈ మేరకు అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి.

మహిళల నుండి డబ్బులు

మహిళల నుండి డబ్బులు

మహిళా సభ్యుల ఫోన్‌ కాల్స్‌ను నిఘా వర్గాలు విశ్లేషించగా నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రత్యేక విభాగం మహిళల నుంచి నిత్యం సొమ్ము వసూళ్లు చేస్తూ తమకు కేటాయించిన మిషన్స్‌పై ఎప్పటికప్పుడు దావూద్‌కు వివరాలు చేరవేస్తున్నట్టు తెలిసింది. దావూద్‌కు అత్యంత సన్నిహితుడైన చోటా షకీల్‌ లేడీస్‌ వింగ్‌ బాధ్యతను ఉస్మాన్‌ అనే తన సన్నిహితుడికి కట్టబెట్టాడని నిఘా వర్గాలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి.

 విస్తుపోయిన మాజీ ఐపిఎస్ అధికారి పీకే జైన్

విస్తుపోయిన మాజీ ఐపిఎస్ అధికారి పీకే జైన్

లేడీస్‌ వింగ్‌కు సంబంధించిన సమాచారం, వారు సాగిస్తున్న కార్యకలాపాలపై మాజీ ఐపీఎస్‌ అధికారి పీకే జైన్‌ విస్తుపోయారు. పోలీస్‌ అధికారిగా తన హయాంలో ఇలాంటి అంశాలు ఎన్నడూ తన అనుభవంలోకి రాలేదని మాఫియా కార్యకలాపాలను నిర్వహించడంలో దావూద్‌ ఇబ్రహీం నిస్సహాయ స్థితిలో ఉన్నాడనేందుకు ఇది సంకేతమని ఆయన అభిప్రాయపడ్డారు.

పాకిస్థాన్ నుండి పోన్‌పై ఫిర్యాదు

పాకిస్థాన్ నుండి పోన్‌పై ఫిర్యాదు

పాకిస్తాన్‌కు చెందిన ఫోన్‌ నెంబర్ల నుంచి రూ కోటి డిమాండ్‌ చేస్తూ ఫోన్‌ కాల్స్‌ వచ్చాయని ముంబయి ఖర్‌ పోలీస్‌ స్టేషన్‌లో మహిళ ఫిర్యాదు చేయడంతో డీ కంపెనీ మహిళా విభాగం కార్యకలాపాలు వెలుగుచూశాయి. మరోవైపు పోలీస్‌ నిఘా, దర్యాప్తు సంస్థల కన్నుగప్పేందుకు దావూద్‌ ముఠా వ్యూహం మార్చిందని.. ఇప్పుడు దావూద్‌ బిట్‌కాయిన్స్‌లో లావాదేవీలు కొనసాగిస్తున్నాడని నిఘా సంస్థలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి.

English summary
In the murky dealing of the Underworld, there has been one unwritten rule that almost every gang has long abided by - keeping women and families out of conflict. Now, all of that may be all set to change.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X