వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంచలనం: మాఫియా డాన్ దావూద్ కరాచీలోనే? ఆసక్తికరంగా సీఎన్ఎన్-న్యూస్18 స్టింగ్ ఆపరేషన్!

మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ లోనే ఉన్నాడని, అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని సీఎన్‌ఎన్-న్యూస్18 వార్తా సంస్థ తెలిపింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ లోనే ఉన్నాడని, అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని సీఎన్‌ఎన్-న్యూస్18 వార్తా సంస్థ తెలిపింది. రెండు నెలల క్రితం ఈ సంస్థ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ వివరాలను గురువారం వెల్లడించింది.

సీఎన్‌ఎన్-న్యూస్18 వార్తా సంస్థ ప్రతినిధి నేరుగా కరాచీలో ఉన్న దావూద్‌తో టెలిఫోన్‌లో సంభాషించారు. తనతో మాట్లాడిన వ్యక్తి స్వరం దావూద్‌దేనని తరువాత ధ్రువీకరించారు. తమ సంవాదాన్ని బట్టి దావూద్.. షేక్ ఇస్మాయిల్ మర్చంట్ అనే మారు పేరుతో డీ 13, బ్లాక్ 4, క్లిఫ్టన్, కరాచీలో ఉన్నాడని సీఎన్‌ఎన్ తెలిపింది.

ఆయనకు స్వల్ప రక్తపోటు తప్ప గ్యాంగ్రిన్, గుండెజబ్బు వంటి వ్యాధులు లేవని ఈ వార్తా సంస్థ పేర్కొంది. తన మాఫియా ముఠా ద్వారా దుబాయ్ నుండి వ్యాపారాలు కొనసాగిస్తున్నాడని తెలిపింది.

Dawood Ibrahim Speaks From His Karachi Den: For the First Time Ever

తొలుత కొద్దిసేపు ఫోన్‌లో మాట్లాడిన దావూద్ ఆ తరువాత తన అనుచరుడు జావెద్ చొటానీతో మాట్లాడించాడని పేర్కొంది. 1993లో 257 మంది మృతికి కారణమైన ముంబై పేలుళ్ల వెనుక ప్రధాన సూత్రధారిగా ఉన్న దావూద్ పాక్‌లో తలదాచుకున్నట్టు భారత్ అనేక సంవత్సరాలుగా చెప్తున్నది.

ఐక్యరాజ్య సమితి సైతం దావూద్‌పై అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్ర వేసింది. అయితే పాక్ మాత్రం దావూద్ తమ దేశంలో లేడని ఇప్పటికీ బుకాయిస్తున్నది. ఈ నేపథ్యంలో సీఎన్‌ఎన్-న్యూస్18 వార్తా సంస్థ ప్రతినిధి జరిపిన స్టింగ్ ఆపరేషన్ సంచలనంగా మారింది.

దావూద్, సీఎన్ఎన్ ప్రతినిధికి మధ్య సాగిన సంభాషణ వివరాలు...

మీడియా ప్రతినిధి : హలో.. హలో
దావూద్‌ : హా.. హాజీ(చెప్పండి)
మీడియా ప్రతినిధి : దావూద్‌ సాబ్‌
దావూద్‌ : నువ్వెవరు? (ఆప్‌ కౌన్‌)
మీడియా ప్రతినిధి : గుడ్‌ ఈవినింగ్‌.. మాట్లాడుతుంది సీఎన్ఎన్‌ ప్రతినిధి
దావూద్ ‌: నీతో చొటానీ మాట్లాడతాడు
మీడియా ప్రతినిధి: ఏంటండీ..
అంటుండగానే దావూద్‌ ఫోన్‌ను తన కీలక అనుచరుడు, 2013 ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ ద్వారా వెలుగులోకి వచ్చిన జావెద్‌ చోటానికి ఫోన్‌ ఇచ్చారు.
జావెద్‌ చోటానీ : హలో ఎవరు?
మీడియా ప్రతినిధి: కొంచెం దావూద్‌ సాబ్‌కు ఫోన్‌ ఇస్తారా?
జావెద్‌ చోటానీ : దావూద్‌ ఎవరు?
మీడియా ప్రతినిధి : దావూద్‌ ఇబ్రహీం సాబ్‌. మీరు పాకిస్తాన్‌లోని కరాచీలో ఉన్నారన్నమాట.
జావెద్‌ చోటానీ : ఎవరు చెప్పారు?
మీడియా ప్రతినిధి : ఇది పాకిస్తాన్ ఫోన్‌ నెంబర్‌
దావూద్‌: సమయం వృథా చేయకు(నేరుగా ఫోన్‌లో చెప్పకుండా చొటానీకి దావూద్‌ ఈ మాట చెబుతుండగా ఫోన్‌లో వినిపించింది)
జావెద్‌ చోటానీ : సమయం వృథా చేస్తున్నావ్‌. మాట్లాడటానికి ఇంటర్వ్యూ చేయడానికి ఎవరు నువ్వు? నీకు అసలు ఏమన్నా తెలుసా? చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు.. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా?
మీడియా ప్రతినిధి : దావుద్‌ తో..
ఈ మాట విన్నాక చోటానీ దేవుడిని తలుచుకుంటూ దావూద్‌ని ఇలాగేనా అనేది, ఇలా పిలుస్తూనే ఇంటర్వ్యూ తీసుకుంటావా? అసలు ఈ ఫోన్‌ నెంబర్‌ ఎవరిచ్చారని ప్రశ్నించాడు. వెంటనే నెంబర్‌ తొలగించమని, మీడియా ప్రతినిధి ఫోన్‌ నెంబర్‌ ఇవ్వాలని అడిగాడు. నెంబర్‌ ఇస్తే మాట్లాడిస్తానని చెప్పాడు. దీంతో నెంబర్‌ ఇవ్వగా, నేరుగా స్టూడియోలో ఇంటర్వ్యూ తీసుకుంటావా? అని ప్రశ్నించాడు. దీంతో తాను కరాచీకి కెమెరా పంపిస్తానని సీఎన్ఎన్ ప్రతినిధి చెప్పగా.. కరాచీనా? ఎందుకు?.. ఇంటర్వ్యూ లేదు ఏమీ లేదు.. అంటూ ఫోన్‌ పెట్టేశాడు.

దీంతో మాఫియా డాన్ దావూద్‌ ఇబ్రహీం బతికే ఉన్నాడని, కరాచీలోనే ఉన్నాడని స్పష్టమైంది.

English summary
The telephone rang that evening at a palatial bungalow in the tony Clifton neighbourhood of Karachi and was answered by the most wanted man in India — Dawood Ibrahim. “Aap Kaun? (Who are you?)” he shot back when asked whether it was Dawood on the line. When this correspondent identified himself, there was a pause as the 1993 Bombay blasts mastermind, clearly rattled at picking up a call he was not supposed to, tried to figure out damage control. “No this is Chotani speaking,” he tried to take evasive action. Chotani — Javed Chotani — is a bookie who masterminds Dawood’s businesses in Dubai. Indians know him through his involvement in the 2013 IPL spot-fixing case where he allegedly worked as a conduit between Dawood and the players.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X