వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దావూద్ ఇబ్రహీం ఒక్కడే: అడ్రస్ లు చాలా ఉన్నాయి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మాఫియా ముఠా నాయకుడు, డీ- కంపెనీ డాన్ దావూద్ ఇబ్రహీం గురించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పలు వివరాలు సేకరించింది.పాకిస్థాన్ కేంద్రంగా డీ కంపెనీ వ్యవహారాలు నిర్వహిస్తున్న దావూద్ ఇబ్రహీంకు అక్కడ పలు వ్యాపారాలు ఉన్నాయని ఆధారాలు సేకరించింది.

కరాచీలో దావూద్ ఇబ్రహీంకు పలు వ్యాపారాలు ఉన్నాయని ఎన్ఐఏ తాను దాఖలు చేసిన చార్జ్ షీట్ లో పేర్కొంది. ఒక ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్, కేష్ ఈక్వినాక్స్ లు దావూద్ భాయ్ పటేల్ అలియాస్ జావేద్ చిక్నా కుటుంబ సభ్యులు నడుపుతున్నారని చార్జ్ షీట్ లో పేర్కొంది.

భారుచ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న చిక్నా పాకిస్థాన్ లోని తన రెండు అడ్రస్ లను పేర్కొన్నాడు. వీటిలో ఒకటి కరాచీలోని బాగ్ ఇబ్నే ఖాసీం వద్ద కాగా మరొకటి డీ -5 మయన్మార్ ఆర్కెడ్, గుల్షన్ ఈ ఇక్బాల్, గల్షన్ సైక్రియాట్రిక్ ఆసుపత్రి, కరాచి అని పేర్కొన్నాడు.

 Dawood’s man wons food joint in Karachi

2002 గుజరాత్ లో జరిగిన అల్లర్లలో యాంటీ ముస్లీం సపోర్టర్లు గా పేరుపొందిన శిరీష్ బన్ గాలీ (ఆర్ఎస్ఎస్), విరాళ్ దేశాయ్ (వీహెచ్ పీ), జయకర్ మహారాజ్ (బజరంగ్ దళ్) లను కుట్ర పన్ని చంపినట్లు జావేద్ మీద కేసులు నమోదు అయ్యాయి. పాకిస్థాన్ కు చెందిన ఐఎస్ఐ సంస్థ ఆదేశాల కారణంగా నే ఈ హత్యలు జరిగాయని ఎన్ఐఏ అధికారులు ఆధారాలు సేకరించారు.

కరాచీలోని ఈ వ్యాపారాలు జావెద్ కుటుంబ సభ్యులకు ఆధార అవసరమా ? లేదా ? అనే సందేహాలు ఉన్నాయని ఐఎన్ఏ అధికారులు అంటున్నారు. ఎన్ఐఏ అధికారుల చార్జ్ షీట్ ప్రకారం జావేద్ భారుచ్ హత్యల కోసం ఆయుధాలు సమకూర్చుకున్నట్లు ఆధారాలు ఉన్నాయి.

మొదట ముంబై, తరువాత సూరత్ లను టార్గెట్ పెట్టుకున్నారు. అయితే ముంబైలో బుల్లెట్ల మ్యాగజైన్ పోవడంతో సూరత్ లో దాడి చేశారని ఎన్ఐఏ చార్జ్ షీట్ లో పేర్కొంది. తనతో పాటు దాడిలో పాల్గొన్న వారి కోసం రూ. 5 లక్షలు ఇవ్వడానికి జావెద్ హవాలా మార్గాన్ని ఎన్నకున్నట్లు ఆధారాలు ఉన్నాయని ఎన్ఐఏ చార్జ్ షీట్ లో తెలిపింది.

English summary
The other address mentioned in the chargesheet is D5, Myanmar Arcade, Gulshan e Iqbal, Gulshan Psychiatric Hospital, Karachi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X