వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త ‘కాగ్’గా జీసీ ముర్ము నియామకం: ఎల్జీ పదవికి రాజీనామా చేసిన మరుసటి రోజే ఉత్తర్వులు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత నూతన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌గా గిరీష్ చంద్ర ముర్ము నియమితులయ్యారు. జమ్మూకాశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన మరుసటి రోజే ఈ నియామకం జరగడం గమనార్హం. బుధవారం రాత్రే ఆయన తన రాజీనామాను రాష్ట్రపతికి పంపిన విషయం తెలిసిందే.

ముర్ము రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం తెపడం.. ఆ తర్వాత జమ్మూకాశ్మీర్ కొత్త లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా మనోజ్ సిన్హా నియమితులు కావడం చకచకా జరిగిపోయాయి. తాజాగా, గురువారం జీసీ ముర్ముును కాగ్ చీఫ్‌గా నియమిస్తూ కేంద్రం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.

 Day after he resigned as J&K LG, GC Murmu appointed next CAG

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి రజత్ కుమార్ మిశ్రా పేరుతో ఈ నోటిఫికేషన్ జారీ అయ్యింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 148 క్లాజ్ 1 ప్రకారం సంక్రమించిన అధికారాలకు అనుగుణంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.. కొత్త కాగ్ చీఫ్‌గా జీసీ ముర్మును నియమించారు.

Recommended Video

Telangana Stares At ₹1.43 Lakh Crore Public Debt As On FY18:CAG

కాగా, ప్రస్తుతం కాగ్ చీఫ్ రాజీవ్ మెహరిషి పదవీ కాలం ఈవారంలోనే ముగియనుంది. కాగా, ఆగస్టు 8న ఆయన 65వ పడిలోకి అడుగుపెట్టనున్నారు. రాజీవ్ కాగ్ పదవి నుంచి తప్పుకున్న వెంటనే జీసీ ముర్ము ఆ బాధ్యతలను చేపట్టనున్నారు. కాగ్ రాజ్యాంగబద్దమైన పదవి కావడంతో ఈ స్థానం ఖాళీగా ఉండకూదు.

English summary
Day after he resigned as J&K LG, GC Murmu appointed next CAG.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X