వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిన్న జయప్రద, నేడు మీడియా ప్రతినిధి : మరోసారి నోరుపారేసుకున్న అజంఖాన్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : జయప్రదపై కాంట్రవర్సీ కామెంట్స్ చేసిన ఎస్పీ నేత, రాంపూర్ సిట్టింగ్ అభ్యర్థి అజంఖాన్ మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ సారి మీడియా ప్రతినిధిపై తన మాటల ప్రతాపాన్ని చూపించారు అజంఖాన్. మధ్యప్రదేశ్‌లోని విదిషాలో ఎంపీ మునేశ్వర్ సలీమ్ అంత్యక్రియలకు హాజరైన అజంఖాన్ .. తన నోటిదురుసును ప్రదర్శించారు.

'ఖాకీ‘ గురించి ప్రశ్నిస్తే

'ఖాకీ‘ గురించి ప్రశ్నిస్తే

తన ప్రత్యర్థి, బీజేపీ ఎంపీ అభ్యర్థి జయప్రదపై ఖాకీ అండర్ వేర్ వ్యాఖ్యలపై దుమారం రేగింది. దీనిని మీడియా ప్రతినిధులు ప్రస్తావించడంతో కాసింత అసహనానికి గురైన అజంఖాన్, 'నేను మీ తండ్రి అంత్యక్రియలకు కూడా వస్తానని‘ తన తలపొగరు మరోసారి బయటపెట్టుకున్నాడు.

మీడియా ప్రతినిధిపై వ్యాఖ్యలు సరికాదు

మీడియా ప్రతినిధిపై వ్యాఖ్యలు సరికాదు

ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభమైన మీడియాపై కూడా అజంఖాన్ తలబిరుసు వ్యాఖ్యలను మేధావులు ఖండిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుపై విరుచుకుపడటం సరికాదని మండిపడ్డారు. ఇది తగదని, చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కూడా కోరారు. ఇటు రాజకీయ పార్టీలు కూడా అజంఖాన్ వ్యాఖ్యలను తప్పుపట్టారు.

ఎన్‌హెచ్చార్సీ సీరియస్

ఎన్‌హెచ్చార్సీ సీరియస్

జయప్రదపై కామెంట్లను జాతీయ మహిళ కమిసన్ సీరియస్ గా తీసుకుంది. కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ ఆరోరాకు ఆదేశాలు జారీచేశారు కమిసన్ చైర్ పర్సన్ రేఖా శర్మ. ఇటు అజంఖాన్ పై కేసు కూడా నమోదైంది.

English summary
A day after Azam Khan landed in a major controversy over his sexist "khaki underwear" jibe against Jaya Prada, An irate-looking Azam Khan lashed out at reporters and said, Came here to attend the funeral of your father".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X