వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పట్టపగటి నేరం: కమల్ హాసన్‌ను తిప్పికొట్టిన దినకరన్

By Pratap
|
Google Oneindia TeluguNews

చెన్నై: ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఫలితంపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్య దుమారం రేపుతోంది. కమల్ హాసన్ వ్యాఖ్యలను ఆర్కే నగర్ ఎమ్మెల్యే దినకరన్ తిప్పికొట్టారు. ఆర్కే నగర్‌లో దినకరన్ విజయం వెనక ధనబలం పనిచేసిందని కమల్ హాసన్ అన్నారు.

అనంద వికటన్ అనే తమిళ మ్యాగజైన్‌కు రాసిన కాలమ్‌లో ఆయన అలా వ్యాఖ్యానించారు. అయితే, ఆయన దినకరన్ పేరును ఆయన ప్రస్తావించలేదు. ఆర్కే నగర్ ఉప ఎన్నిక భారత ప్రజాస్వామ్యానికి మచ్చ అని ఆన అన్నారు.

కొనుగోలు చేశారు..

కొనుగోలు చేశారు..

ఆర్కే నగర్ విజయం కొనుగోలు చేసిందని కమల్ హాసన్ అన్నారు. ఆర్కే నగర్ ఉప ఎన్నిక తమిళనాడు రాజకీయాలపై మచ్చ అని, భారత ప్రజాస్వామ్యానికి పెద్ద మచ్చ అని అన్నారు. దాన్ని కొనుగోలు చేసిందని కూడా అనడానికి వీల్లేదు, అదో కుంభకోణం, పట్టపగలు నేరమని ఆయన అన్నారు.

ఎన్నిక వాయిదా విషయాన్ని...

ఎన్నిక వాయిదా విషయాన్ని...

గత ఏప్రిల్‌లో ఓటర్లకు లంచం ఇవ్వజూపుతున్నారనే ఆరోపణలపై ఆర్కే నగర్ ఉప ఎన్నికను ఎన్నికల కమిషన్ రద్దు చేసిన విషయాన్ని కమల్ హాసన్ గుర్తు చేశారు. అప్పుడు దినకరన్ అధికార అన్నాడియంకె పార్టీ అభ్యర్థిగా పోటీకి దిగారు. ఆ తర్వాత పన్నీరు సెల్వం, పళనిసామి ఒక్కటై ఆయనను అన్నాడియంకె నుంచి తప్పించారు.

ఖండించిన దినకరన్...

ఖండించిన దినకరన్...


కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించాల్సినవని దినకరన్ అన్నారు. ఆ వ్యాఖ్యలు కమల్ హాసన్ వయస్సుకు, అనుభవానికి తగినవి కావని అన్నారు. విజేతపై దాడి చేసే క్రమంలో కమల్ హాసన్ ఓటర్లపై దాడి చేశారని ఆయన అన్నారు. నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా ఓటర్లు నాకు ఓటేసారని ఆయన అన్నారు.

కమల్ హాసన్ దేవుడా, న్యాయమూర్తా

కమల్ హాసన్ దేవుడా, న్యాయమూర్తా

కమల్ హాసన్ దేవుడా, న్యాయమూర్తా అని దినకరన్ ప్రశ్నించారు. వాస్తవం తెలుసుకోవడానికి కమల్ హాసన్ పోటీ చేయాల్సి ఉండిందని ఆయన అభిప్రాయపడ్డారు. కమల్ హాసన్ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యాన్ని ప్రస్తావిస్తూ - ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో మనుగడ సాగిస్తారా అని అడిగారు. ఎవరో రాసిన సంభాషణలు చెప్పడానికి రాజకీయాలు స్ట్రిప్టుతో కూడిన సినిమాలు కావని ఆయన అన్నారు.

English summary
without naming Dhinakaran, Kamal Haasan in his article, said the RK Nagar bypoll win was a "purchased" one.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X