వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడు రాష్ట్రాల్లో ప్రజా తీర్పుపై స్పందించిన రాహుల్, ఏమన్నారంటే...

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్, మేఘాలయలో ఎన్నికల ఫలితాలపై మూడ్రోజుల తరువాత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తున్నట్లు సోమవారం పేర్కొన్నారు. ఓటర్ల విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు తమ పార్టీ కృషి చేస్తుందని రాహుల్ తెలిపారు.

త్రిపుర, నాగాలాండ్‌లో కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమిని చవిచూసింది. మేఘాలయాలో పెద్ద పార్టీగా నిలబడినప్పటికీ అధికారానికి అవసరమైన మెజారిటీ సీట్లు మాత్రం సాధించలేక పోయింది. ఈ నేపథ్యంలో ప్రజా తీర్పుపై ఓ ట్వీట్‌లో రాహుల్ స్పందించారు.

Days after North East poll results, Rahul Gandhi tweets, says Congress respects people's mandate - 'Will win back people's trust'

ప్రజా తీర్పు శిరోధార్యమని, కోల్పోయిన ప్రజా విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు పార్టీ శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని రాహుల్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో పార్టీ పటిష్టానికి తాము కట్టుబడి ఉన్నామని చెబుతూ.. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం శ్రమించిన కార్యకర్తలను ఆయన అభినందించారు.

మేఘాలయలో కాంగ్రెస్ 21 సీట్లు గెలుచుకున్నా అధికారంలోకి రాలేకపోయింది. ఫలితాలు వెలువడిన వెంటనే రంగంలోకి దిగిన బీజేపీ.. ప్రాంతీయ పార్టీలు, ఇండిపెండెంట్లతో పొత్తు కుదుర్చుకుని ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకొచ్చింది. దీంతో మేఘాలయాలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న కాంగ్రెస్ యోచన కలగానే మిగిలిపోయింది.

English summary
Three days after election results in three North East states of Tripura, Nagaland and Meghalaya, Congress president Rahul Gandhi on Monday took to social media, and said that the party is committed to win back the trust of the people. The Congress put up a dismal show in Tripura and Nagaland, securing merely 2.1 percent and 1.8 percent of the vote share respectively. In Meghalaya, although it won the most number of seats (21), it fell short of the majority mark. The state is likely to have a non-Congress government, as the UDP extended its support the National People's Party (NPP). Top party leaders Ahmed Patel and Kamal Nath rushed to Shillong to hold discussions with regional parties but to no avail. Rahul was in Italy on the day of the results, due to which he faced widespread criticism and barbs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X