వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనావేళ వింత జననం: అది చూస్తూనే అందరికీ షాక్..!

|
Google Oneindia TeluguNews

అస్సాం: కొద్ది రోజుల క్రితం తెలంగాణలో రెండు తలల గొర్రె పుట్టింది. అది ఆరోగ్యంగా కూడా ఉన్నింది. తాజాగా అలాంటి ఘటనే అస్సాంలో చోటుచేసుకుంది. అయితే ఇక్కడ గొర్రె కాదు.. ఓ వింత రూపంలో పంది పుట్టింది. ఈ పంది పిల్లకు రెండు తలలు, రెండు ముక్కులు మూడు కళ్లు ఉన్నాయి. ఈ పందిపిల్ల సంగతేంటో తెలుసుకోవాలంటే అస్సాంలోని హాన్‌సింగ్ ఇంగీ అనే రైతు ఇంటికి వెళ్లాల్సిందే.

ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న పంది పిల్లను జాగ్రత్తగా పరిశీలించండి. దీనికి రెండు తలలు, రెండు ముక్కులు ,మూడు కళ్లు ఉన్నాయి. ఇక అసలు విషయానికొస్తే అస్సాంలోని వెస్ట్ కార్బి అంగ్లాంగ్ జిల్లాలోని మెన్మ్‌జీముఖి గ్రామంలో హాన్‌సింగ్ ఇంగీ అనే రైతు పొలంలో ఓ పంది ఏడు పంది పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఇందులో ఒకటి చాలా వింతగా పుట్టింది. రెండు తలలు మూడు కళ్లు, రెండు ముక్కులు ఉండి పుట్టింది. ఇక రెండు తలలతో పంది పుట్టిందన్న విషయం తెలుసుకున్న వార్త దావనంలా వ్యాపించడంతో చుట్టుపక్కల గ్రామాల వారు ఈ పందిని చూసేందుకు రైతు హాన్‌సింగ్ ఇంటికి క్యూకట్టారు.

Days after two headed sheep born in Telangana, A two headed piglet makes news in Assam

Recommended Video

Fake News Buster 15 : అలాంటి ఆలోచన లేదు అంటున్న ICMR

పందిని గత ఐదేళ్లుగా పెంచుతున్నట్లు హాన్‌సింగ్ చెప్పారు. అయితే రెండు తలల పంది పిల్లను చూసి షాక్‌ అయినట్లు వెల్లడించాడు. ఇక వింత రూపంలో పుట్టిన ఈ పంది పిల్లకు మరింత జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పాడు. ఈ పంది పిల్ల కాళ్లల్లో శక్తి లేదని నడవలేక పోతోందని చెప్పాడు. ఇదిలా ఉంటే ఇలాంటి రూపంలో పుట్టే జంతువులు ఎక్కువ రోజులు బతకవని వెటరనరీ డాక్టర్లు చెబుతున్నారు. సాధారణంగా పందులు కానీ ఇతర జంతువులు కానీ అసాధారణ రీతిలో జన్మించడం చాలా అరుదుగా జరుగుతుందని అలాంటివి ఎక్కువ కాలం బతకవని వెటరనరీ డాక్టర్లు చెబుతున్నారు. పుట్టిన కొన్ని వారాలకే ఇవి చనిపోతాయని వెటరనరీ డాక్టర్ సంజీవ్ మిశ్రా తెలిపాడు. ఇక రెండు తలల పంది పిల్ల పుట్టిందన్న వార్త గ్రామంలో తెలియగానే దాన్ని చూసేందుకు గ్రామస్తులంతా హాన్‌సింగ్ ఇంటికి తరలివచ్చారు.

English summary
Honsing Inghi, a farmer in Menmiji Mukhim village in Assam’s West Karbi Anglong district, got the fright of his life recently when he saw one of the pigs at his farm give birth to seven piglets, as one of these was a two-headed one with three eyes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X