వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిప్లా, హెటిరో తాజాగా మైలాన్ : రెమ్‌డెసివిర్ డ్రగ్‌ తయారీకి గ్రీన్‌ సిగ్నల్, ధర ఎంతంటే..?

|
Google Oneindia TeluguNews

కరోనావైరస్ విరుగుడుకు ఇప్పటికే చాలా సంస్థలు తమ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే భారత్ బయోటెక్ అనే ఫార్మా కంపెనీ వ్యాక్సిన్‌ తయారు చేయగా ప్రస్తుతం అది హ్యూమన్ ట్రయల్స్‌లో ఉంది. త్వరలోనే ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక తాజాగా మరో ప్రముఖ ఫార్మా కంపెనీ మైలాన్‌కు రెమ్‌డెసివిర్ డ్రగ్ తయారీకి భారత ఔషధ నియంత్రణ సంస్థ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. అయితే ఈ డ్రగ్ వినియోగంపై కొన్ని ఆంక్షలు విధించింది అదే సమయంలో అత్యవసర పరిస్థితుల్లోనే వినియోగించాలని సూచించింది. ఇక దీని ధర 100చం వయల్‌కు రూ.4,800 ఉండొచ్చని సమాచారం.ఇది ఈ నెలలోనే పేషెంట్లకు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

కరోనావైరస్ మహమ్మారి తర్వాత భవిష్యత్ ఉద్యోగాలు ఎలా ఉంటాయి?కరోనావైరస్ మహమ్మారి తర్వాత భవిష్యత్ ఉద్యోగాలు ఎలా ఉంటాయి?

ఇక ఇప్పటికే రెమ్‌డెసివిర్ తయారీ చేసేందుకు సిప్లా మరియు హెటిరో కంపెనీలకు డీసీజీఐ అనుమతి ఇచ్చింది. రెమ్‌డెసివిర్ మెడిసిన్ తయారీకి అదే సమయంలో మార్కెటింగ్‌కు డీసీజీఐ అనుమతి ఇచ్చిందని మైలాన్ ఫార్మా సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. కోవిడ్-19తో పేషెంట్ల పరిస్థితి ప్రమాదకరంగా మారితే ఆ సమయంలో రెమ్‌డెసివిర్ ఇచ్చేందుకు డీసీజీఐ అనుమతి ఇచ్చింది. రెమ్‌డెసివిర్ అనే ఈ ఔషధం "డెస్‌రెమ్‌" అనే బ్రాండ్‌ కింద విడుదల చేస్తామని మైలాన్ సంస్థ తెలిపింది.

DCGI gives a nod to Pharma company Mylan for manufacturing of Remdesivir drug to fight Covid

ఇతర దేశాలతో పోలిస్తే 80శాతం తక్కువ ధరకే ఈ మెడిసిన్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించింది మైలాన్ సంస్థ. రెమ్‌డెసివిర్‌తో పాటు మైలాన్ సంస్థ పలు ఉత్పత్తులను అమెరికాలో కూడా తయారు చేస్తుంది. యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌ నుంచి మైలాన్ తయారు చేసే చాలా ఔషదాలకు అనుమతి లభించింది. ఇక అత్యవసర పరిస్థితుల్లో పేషెంట్లకు కావాల్సిన రెమ్‌డెసివిర్ మెడిసిన్‌ను ఇతర 127 తక్కువ లేదా మధ్య ఆదాయం ఉన్న దేశాలకు కూడా విస్తరించాలని కూడ మైలాన్ సంస్థ ఆలోచిస్తోంది.

Recommended Video

Serial Actor Ravi Krishna,Shiva Jyothi Live About His Corona కరోనా గురించి మాట్లాడిన రవికృష్ణ

మైలాన్ మరియు గిలియడ్ సైన్సెస్ గతకొన్నేళ్లుగా కలిసి ఎన్నో మెడిసిన్స్‌ను తయారు చేశాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హెచ్‌ఐవీ/ఎయిడ్స్. ఈ ఔషధాలు తయారు చేసి ఎంతో మంది పేషెంట్లను ఆదుకున్నట్లు మైలాన్ సంస్థ ప్రెసిడెంట్ రాజీవ్ మాలిక్ చెప్పారు. ఇక ఎన్నో వ్యాధులకు మెడిసిన్ కనుగొనడంలో ముందుండి కృషి చేస్తున్న గిలియాడ్ సంస్థను మైలాన్ సంస్థ అభినందించింది. ఇక కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ మహమ్మారిపై పోరులో తమ సంస్థను కూడా భాగస్వామ్యం చేసినందుకు భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది మైలాన్ సంస్థ. ఇక ఇప్పటికే సిప్లా సంస్థ రెమ్‌డెసివిర్ మెడిసిన్‌ను ఒక్క వయల్ రూ.5000 ధర నిర్ణయించగా మరో సంస్థ హెటిరో రూ.5400 రేటును ఫిక్స్ చేసింది.

English summary
DCGI gives a nod to pharma company Mylan for Remdesivir drug manufacturing and marketing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X