వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళతో ఏఏపీ విశ్వాస్ సంబంధం: హైడ్రామా, డీసీడబ్ల్యూ మెంబర్ రిజైన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీలోని ప్రకంపనలు ఢిల్లీ కమిషన్ ఫర్ వుమెన్ (డీసీడబ్ల్యూ)కు కూడా తాకింది. ఏఏపీ నేత కుమార్ విశ్వాస్‌కు నోటీసుల అంశంపై డీసీడబ్ల్యూ మెంబర్ ఒకరు తన పదవి నుండి తప్పుకున్నారు. కుమార్ విశ్వాస్‌కు నోటీసులు ఇస్తుండటం ద్వారా ఏఏపీ ప్రతిష్టను భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపిస్తూ సభ్యురాలైన జుహీఖాన్ తప్పుకున్నారు.

జూహిఖాన్... డీసీడబ్ల్యూ చీఫ్ బర్కా దత్‌తో కలిసి జాయింట్ ప్రెస్ మీట్‌లో మాట్లాడారు. కుమార్ విశ్వాస్‌కు నోటీసులు జారీ చేయడం రాజకీయపరంగా జరిగిందని జూహిఖాన్ ఆరోపించారు. విశ్వాస్‌కు, ఆయన భార్యకు నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.

DCW affected by AAP drama, one member quits

కాగా, ఏఏపీ నేత కుమార్ విశ్వాస్, ఆయన భార్యకు సోమవారం నాడు డీసీడబ్ల్యూ నోటీసులు జారీ చేసింది. మంగళవారం నాడు మధ్యాహ్నం మూడు గంటలకు తమ ఎదుట హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. ఆయన హాజరు కాలేదు. తనకు ఎలాంటి నోటీసులు అందలేదని చెప్పారు.

అనంతరం డీసీడబ్ల్యూ మరో నోటీసు జారీ చేసింది. బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటలోగా కమిషన్ ముందు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. దీనిని బర్కా దత్ పక్కనే ఉన్న సభ్యురాలు జూహిఖాన్ తప్పుపట్టారు. కుమార్ విశ్వాస్‌ను టార్గెట్ చేసుకున్నారని ఆమె ఆరోపించారు.

English summary
High drama was witnessed at the Delhi Commission for Women on Tuesday as a member revolted against its chief alleging that she maligned the image of AAP leader Kumar Vishwas by issuing summons to him on the basis of complaint by a party volunteer that he did not dispel rumours of an illicit affair with her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X