వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేజ్రీవాల్ కు పెద్ద షాక్ ఇచ్చిన కేంద్రం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు కేంద్ర ప్రభుత్వం మరో షాకిచ్చింది. డీడీసీఏ స్కాంపై విచారణకు చట్టబద్దత లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. విచారణ కమీషన్ ఏర్పాటు రాజ్యంగ విరుద్దమని కేంద్రం పేర్కొంది.

డీడీసీఏ స్కాంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రమేయం తేల్చేందుకు విచారణ కమిషన్ ను ఆప్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. డీడీసీఏ స్కాంకు, అరుణ్ జైట్లీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ నాయకులు చెబుతున్నారు.

DDCA Commission of Inquiry not valid: Central Government

కేంద్ర ప్రభుత్వం కావాలనే డీడీసీఏ కుంబకోణంలో అరుణ్ జైట్లీని రక్షించడానికి ప్రయత్నిస్తున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అశుతోష్ ఆరోపించారు. అందుకే కేంద్ర ప్రభుత్వం డీడీసీఏ విచారణను అడ్డుకుంటున్నదని మండిపడ్డారు.

డీడీసీఏ స్కాంలో అరుణ్ జైట్లీ ప్రమేయం లేకపోతే విచారణ ఎదుర్కోవడానికి ఎందుకు అంత భయం అని ప్రశ్నిస్తున్నారు. డీడీసీఏ కుంబకోణంలో అరుణ్ జైట్లీ ఏ తప్పు చెయ్యకపోతే పూర్తిగా సహకరించాలని ఆప్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

English summary
The Union Home Ministry has termed the Commission of Inquiry constituted by the Delhi Government to probe the irregularities in the DDCA as null and void.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X