• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

డియర్ కామ్రేడ్ .. అత్యంత విషాదం .. కరోనాతో సీతారాం ఏచూరి కుమారుడి మృతిపై మోడీతో పాటు పలువురి ట్వీట్స్ !!

|

సీనియర్ వామ పక్ష నేత, సిపిఎం జనరల్ సెక్రెటరీ సీతారం ఏచూరి కుమారుడు ఆశిష్ ఏచూరి ఈరోజు ఉదయం ఢిల్లీలో కరోనా మహమ్మారితో పోరాడి మరణించారు. జూన్లో 35 ఏళ్లు నిండనున్న తన పెద్ద కొడుకు మరణాన్ని సోషల్ మీడియా వేదికగా సీతారాం ఏచూరి తెలియజేశారు. కరోనా పోరాటంలో తన కుమారుడి కోసం వైద్యం అందించిన డాక్టర్లకు, ఆరోగ్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. కుమారుడి మృతితో తీవ్ర దుఃఖంలో ఉన్న సీతారాం ఏచూరికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు . సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

సీతారాం ఏచూరికి సంతాపం తెలిపిన పీఎం మోడీ, కేరళ సీఎం పినరయి విజయన్

సీతారాం ఏచూరికి సంతాపం తెలిపిన పీఎం మోడీ, కేరళ సీఎం పినరయి విజయన్

ఆశిష్ ఏచూరి మరణం విషాదకరమైన వార్త అని , అకాల మరణం అని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. సీతారం ఏచూరికి , ఆయన కుటుంబానికి ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఆశిష్ ఏచూరి మరణం పై, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ట్విట్టర్ ద్వారా తన సంతాపాన్ని ప్రకటించారు . ప్రియమైన కామ్రేడ్ .. సీతారాం ఏచూరి , ఆశిష్ ను కోల్పోయి మీకు జరిగిన నష్టానికి మా ప్రగాఢ సంతాపం అని పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో మా ఆలోచనలు మీతో మరియు మీ కుటుంబ సభ్యులతో ఉన్నాయని పినరయి విజయన్ ట్వీట్ చేశారు.

తీవ్ర ఆవేదన చెందానన్న కాంగ్రెస్ నేత శశిథరూర్

తీవ్ర ఆవేదన చెందానన్న కాంగ్రెస్ నేత శశిథరూర్

నిన్న కరోనా-19 పాజిటివ్ నిర్ధారణ అయిన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, ఆశిష్ ఏచూరి మరణ వార్తతో తాను తీవ్ర ఆవేదనకు గురయ్యానని అన్నారు. ఒక తండ్రికి ఇంతకుమించిన భారీ నష్టం మరోటి ఉండదని పేర్కొన్నారు. ఈ కష్టాన్ని తట్టుకునే శక్తిని, ఈ బాధ నుండి బయటపడే సత్తువను మీకు ఇవ్వాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ఈ బాధాకర సమయంలో నా మనసు తీవ్రంగా కలత చెందుతుంది అని కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ ట్వీట్ చేశారు.

తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు డెరెక్ ఓబ్రెయిన్, నేషనల్ కాన్ఫరెన్స్ ఒమర్ అబ్దుల్లా కూడా ప్రముఖ సిపిఐ (ఎం) నాయకుడికి తమ సంతాప సందేశాలను పంపారు.

ఘోరమైన నష్టం సీతా .. చీకట్లో బ్రతుకుతున్నామన్న ప్రశాంత్ భూషణ్, సంతాపం తెలిపిన స్టాలిన్

ఘోరమైన నష్టం సీతా .. చీకట్లో బ్రతుకుతున్నామన్న ప్రశాంత్ భూషణ్, సంతాపం తెలిపిన స్టాలిన్

ఇది ఘోరమైన నష్టం సీతా. మనము ప్రస్తుతం జీవితంలోని చీకటి కాలంలో జీవిస్తున్నాము. ఈ నష్టాన్ని భరించే శక్తి మీకు ఇవ్వాలని కోరుకుంటూ నా హృదయపూర్వక సంతాపం అని న్యాయవాది- సామాజిక కార్యకర్త ప్రశాంత్ భూషణ్ అన్నారు.

తమిళనాడు రాజకీయ నాయకుడు, డిఎంకె చీఫ్ ఎంకె స్టాలిన్ మాట్లాడుతూ, "ఆశిష్ ఏచూరిని కోల్పోయినందుకు చాలా బాధగా ఉందన్నారు . ఈ కష్ట సమయంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి అతని కుటుంబం మరియు స్నేహితులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానని పేర్కొన్నారు .

కాంగ్రెస్ జాతీయ ప్రతినిధి జైవీర్ షెర్గిల్ ట్వీట్ .. కరోనాతో పలువురు రాజకీయ నాయకులకు తీరని శోకం

కాంగ్రెస్ జాతీయ ప్రతినిధి జైవీర్ షెర్గిల్ ట్వీట్ .. కరోనాతో పలువురు రాజకీయ నాయకులకు తీరని శోకం

కోవిడ్ కారణంగా సీతారాం ఏచూరి పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి మరణ వార్త విచారంలో ముంచేసిందని, ఈ నష్టాన్ని భరించడానికి మొత్తం కుటుంబానికి బలం చేకూర్చడానికి భగవంతుడిని ప్రార్థిస్తున్నా అని కాంగ్రెస్ జాతీయ ప్రతినిధి జైవీర్ షెర్గిల్ అన్నారు.

భారతదేశం గత 24 గంటల్లో మూడు లక్షలకు పైగా తాజా కోవిడ్ -19 కేసులు మరియు 2,104 మరణాలను నమోదు చేసింది, మరో భయంకరమైన, రోజువారీ కేసుల ఉప్పెన ను చూసింది . కరోనా వైరస్ దేశంలో 1,84,657 మందిని పొట్టనబెట్టుకుంది . అందులో ఎంతో మంది రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారు .

English summary
Senior Left leader Sitaram Yechury's son Ashish Yechury died of COVID-19 in Delhi this morning. Condolences poured in for the CPI(M) leader and his family after he announced the death of his older son. Prime Minister Narendra Modi termed Ashish Yechury's death "tragic and untimely". Kerala CM pinarayi vijayan , shashi tharoor , stalin , prashanth bhushan tweeted their Condolences.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X