వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'డియర్ జెఎన్‌యు స్టూడెంట్స్! మీ రాజకీయాలకు మేం నిధులివ్వట్లేదు'

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 'ప్రియమైన విద్యార్థులారా! మీరు చదువుకుంటామంటే మేం నిధులు ఇచ్చాం. మీరు విశ్వవిద్యాలయాలలో రాజకీయాలు చేసేందుకు ఇవ్వలేదు' అని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో, ప్రస్తుత అరియన్ కాపిటల్ పార్టనర్స్ చైర్మన్‌గా ఉన్న మోహన్‌దాస్ పాయ్ జెఎన్‌యు విద్యార్థులకు ఘాటు లేఖ రాశారు.

కొద్ది రోజులుగా ఢిల్లీలోని జెఎన్‌యు సహా పలు విశ్వవిద్యాలయాలలో జరిగిన ఘటనలను ప్రస్తావిస్తూ.. మోహన్‌దాస్ పాయ్ విద్యార్థులను ఉద్దేశించి ఓ ఘాటైన లేఖ రాశారు. తాము సంపాదించిన డబ్బులో విద్యార్థుల చదువు నిమిత్తం మాత్రమే వితరణ చేస్తున్నామని, రాజకీయాలు చేసేందుకు కాదన్నారు.

విద్యావ్యవస్థ పక్కదారిపడుతోందని ఆరోపించారు. కనీసం విద్యాభ్యాసం ముగిసే వరకూ అన్ని రకాల రాజకీయాలను పక్కన బెట్టాలని పిలుపునిచ్చారు. భారత విద్యావ్యవస్థ కుల, మత, ప్రాంతాలుగా విభజనకు గురికావడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.

Dear JNU Students, We Fund Your Studies, Not Your Politics

1991లో ప్రారంభమైన జెఎన్‌యు ఎంతో మంది విద్యాధికులను భారత్‌కు అందించిందని, ఇప్పుడు అదే విశ్వవిద్యాలయం ఈ తరహా రాజకీయాలకు పావుగా మారడం తనకెంతో బాధను కలిగిస్తోందన్నారు. విద్యార్థులు జాతి వ్యతిరేక నినాదాలు చేయడం సరికాదని మోహన్‌దాస్ పాయ్ అభిప్రాయపడ్డారు.

జరిగిన ఘటనలను రాజకీయ పక్షాలు తమ ప్రయోజనాలు తీర్చుకునేందుకు ఉపయోగించుకుంటున్నారన్నారు. ఉగ్రవాది అఫ్జల్ గురుకు మద్దతిస్తున్న కొందరు విద్యార్థులకు స్వయంగా రాహుల్ గాంధీ మద్దతివ్వడం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు కొనసాగితే విద్యా వ్యవస్థ కుంటుపడుతుందని, విద్యాభివృద్ధికి నిధులిచ్చేవారు వెనుకంజ వేస్తారని హెచ్చరించారు.

English summary
Dear JNU Students, We Fund Your Studies, Not Your Politics
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X