• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అలా ఐతేనే గెలుస్తాం: ప్రధాని మోడీ ప్రచారం చేయాలంటూ డీఎంకే నేతల విన్నపాలు

|

చెన్నై: ప్రధాని నరేంద్ర మోడీ తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలంటూ పలువురు డీఎంకే నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కోరుతుండటం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తమ నియోజకవర్గంలోని బీజేపీ, అన్నాడీఎంకే అభ్యర్థుల తరపున ప్రచారం చేయాలంటూ ప్రత్యర్థి పార్టీ డీఎంకే నేతలు సోషల్ మీడియా వేదికగా వరుస ట్వీట్లు చేస్తున్నారు.

శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ అభ్యర్థుల తరపున మధురై, కన్యాకుమారిలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో డీఎంకే నేతలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. 'ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ.. మీరు కుంభం నియోజకవర్గంలో ప్రచారం చేయండి. నేను ఈ ప్రాంతంలో డీఎంకే తరపున బరిలో ఉన్నాను. నేను భారీ తేడాతో విజయం సాధించేందుకు మీ ప్రచారం సహకరిస్తుంది' అని రామక్రిష్టన్ ట్వీట్ చేశారు.

‘Dear PM Modi, campaign for my opponent’: DMK leaders’ cheeky request ahead of polls

తాను తిరువణ్ణమలై స్థానం నుంచి బరిలో ఉన్నానని, ఆ స్థానంలో ప్రచారం చేయండంటూ ఈవీ వేలు అనే మరో డీఎంకే నేత ట్వీట్ చేశారు. వీరితోపాటు అనితా రాధాక్రిష్టన్, సెల్వరాజ్ కే, అంబేత్ కుమార్ వంటి తదితర నేతలు కూడా ఇదే తరహాలో సోషల్ మీడియాలో ట్వీట్లు చేశారు.

అన్నాడీఎంకే అభ్యర్థి, తమిళనాడు మంత్రి ఎస్పీ వేలుమణి తరపున ప్రచారం చేయాలని డీఎంకే అభ్యర్థి కార్తికేయ శివసేనాపతి ప్రధాని మోడీని కోరారు. మీరు ఆయనకు మద్దతు ఇస్తే.. నాకు ప్రయోజనం ఉంటుందంటూ ట్వీట్ చేశారు. ఇలాగే మరికొంతమంది డీఎంకే నేతలు కూడా సరికొత్త రీతిలో విమర్శలు చేశారు. తమిళనాడులో ఏప్రిల్ 6న 234 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మే 2న ఫలితాలు విడుదల కానున్నాయి.

కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకేతో కలిసి బీజేపీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు కాంగ్రెస్, డీఎంకే కలిసి పోటీ చేస్తున్నాయి. కమల్ హాసన్ పార్టీ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఎన్నికలు మరింత ఉత్కంఠగా సాగనున్నాయి.

English summary
DMK candidates launched a cheeky Twitter campaign Friday tagging Prime Minister Narendra Modi with a special request. They all wanted him to come and campaign for their opponents in AIADMK. They believe it will help increase their winning margin.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X