బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తొలి ట్యాక్సీ డ్రైవర్‌గా రికార్డ్ సృష్టించిన ఏపీ మహిళ బలవన్మరణం

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: భారతీ వీరత్.. ఆంధ్రా ప్రాంతం నుంచి కర్నాటకకు వలస వెళ్లిన యువతి. కుటుంబ జీవనం కొనసాగించేందుకు ప్రయివేటు క్యాబ్ సేవల సంస్థ ఉబెర్‌లో రెండేళ్ల క్రితం డ్రైవర్‌గా చేరింది. బెంగళూరులో తొలి మహిళా క్యాబ్ డ్రైవర్‌గా చరిత్ర సృష్టించింది.

ఆమె అనూహ్యంగా తనువు చాలించింది. ఆమె మృతి చర్చనీయాంశంగా మారింది. విరాల ప్రకారం... పదేళ్ల క్రితం కన్నడ ప్రాంతానికి వెళ్లిన ఆమె తొలుత టైలర్‌గా, ఆ తర్వాత ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో డ్రైవింగ్ నేర్చుకుని క్యాబ్ డ్రైవర్‌గా చేరింది.

Death of Bengaluru's first woman taxi driver- Foul play not ruled out

ఒంటరిగా ఉంటున్న ఆమె.. గత కొంత కాలంగా, తిరిగి స్వగ్రామానికి వెళ్లిపోవాలని భావించినట్లు స్థానికులకు చెప్పింది. రెండు రోజుల నుంచి ఆమె కనిపించకపోవడంతో, ఇంటి యజమాని ఆమె ఉంటున్న ఇంటి వద్దకు వెళ్లి కిటికీ లోంచి చూశాడు.

లోపల సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకున్న కనిపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. 39 ఏళ్ల భారతి తాను అద్దెకు ఉంటున్న మూడో అంతస్తులో ఫ్యాన్‌కు ఉరేసుకొని మృతి చెందింది. భారతి ఏపీలోని ఒంగోలుకు చెందిన మహిళ.

English summary
The death of Bharathi Veerath, Bengaluru's first woman taxi driver has sent shock waves. Although her death is being treated as a case of suicide, police also do not rule out foul play.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X