వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాడు బ్రిటీష్ వారికి నేడు భారతీయులకు: 90 ఏళ్లుగా సేవలందిస్తున్న డెక్కన్ క్వీన్ ఎక్స్‌ప్రెస్

|
Google Oneindia TeluguNews

ముంబై: భారత రైల్వేల్లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా కొన్ని ప్రత్యేక రైళ్లను కూడా రైల్వే శాఖ ప్రవేశపెడుతోంది. ఈ మధ్యే శతాబ్ది ఎక్స్‌ప్రెస్ స్థానంలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రవేశపెట్టింది రైల్వేశాఖ. కానీ కొన్ని దశాబ్దాలుగా శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కే ప్రయాణికులు అలవాటు పడిపోయారు. ఇలా కొన్ని రైళ్లు చరిత్ర క్రియేట్ చేశాయి. ఇందులో ఒకటి డెక్కన్ క్వీన్ ఎక్స్‌ప్రెస్.

90వ ఏటాలోకి అడుగిడిన డెక్కన్ క్వీన్ ఎక్స్‌ప్రెస్

డెక్కన్ క్వీన్ ఎక్స్‌ప్రెస్..ఇది మహారాష్ట్రలో ఉండేవారికి సుపరిచితం. ఈ రైలు పూణే -ముంబైల మధ్య పరుగులు తీస్తుంది. ఈ రైలు సర్వీసు ప్రారంభమై 89 ఏళ్లు దాటింది. శనివారం రోజున డెక్కన్ క్వీన్ రైలు 90వ ఏటాలోకి అడుగుపెట్టింది. తక్కువ సమయంలోనే ఎక్కువ దూరంను కవర్ చేస్తుంది ఈ రైలు. 90వ సంవత్సరంలోకి డెక్కన్ క్వీన్ రైలు అడుగుపెట్టడంతో దీనికి మార్పులు చేయాలని రైల్వే శాఖ అధికారులు భావిస్తున్నారు. దీన్ని పుష్ పుల్ ఇంజిన్‌తో నడిపించాలని భావిస్తున్నారు. కోచ్‌లలో కూడా మార్పులు తీసుకురావాలని భావిస్తున్నారు. డెక్కన్ క్వీన్‌లో దాదాపుగా 50 ఏళ్ల నుంచి తాను ప్రయాణం చేస్తున్నట్లు ఓ వ్యక్తి చెప్పాడు. ఇది ఇక్కడి ప్రజలతో చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయిన రైలుగా అభివర్ణించారు.

నాడు డెక్కన్ క్వీన్‌లో ఎన్నో ప్రత్యేకతలు

1930లో ఈ రైలు పట్టాలెక్కినప్పుడు ఇందులో డ్రెస్సింగ్ రూమ్స్, బాత్రూమ్స్, సలూన్, డైనింగ్ కార్‌ ఇలా ఎన్నో ప్రత్యేక ఆకర్షణలు ఉండేవట. అంతేకాదు నాటి బ్రిటీష్ ఆర్మీ కోసం గుర్రాలను పూణే నుంచి ముంబైకి రవాణా చేసేదని రైల్వే ప్రవాసీ గ్రూప్ ప్రెసిడెంట్ హర్షా షా తెలిపారు. అయితే 1950లో అన్ని హంగులూ తొలగించి ఒక్క డైనింగ్ కార్ మాత్రమే ఉంచినట్లు ఆమె గుర్తుచేసుకున్నారు. ఇక 1987లో మొత్తం రైలుకు తెలుపురంగు వేశారని చెప్పారు.

డెక్కన్ క్వీన్ చరిత్ర ఇదీ..!

డెక్కన్ క్వీన్ చరిత్ర ఇదీ..!

డెక్కన్ క్వీన్‌ను 1930లో ప్రవేశపెట్టారు. మహారాష్ట్రలోని రెండు ప్రధాన నగరాలను కనెక్ట్ చేస్తూ ఈ రైలు పరుగులు తీసింది. ఆ నాడు గ్రేట్ ఇండియా పెనిన్‌సులా రైల్వేగా ఉన్నింది. ఆ సమయంలోనే అంటే 1930 జూన్ 1న ఈ రైలు సర్వీసులను ప్రారంభించారు. ఇది తొలి డీలక్స్ రైలు. పూణే నగరం పేరు తర్వాత ఈ రైలుకు దక్కన్ కీ రాణి అనే పేరును ఖరారు చేశారు. తొలుత రెండు అరలతో కూడిన ఏడు కోచ్‌లను ప్రవేశపెట్టారు. ఇందులో ఒకటి సిల్వర్ పెయింటింగ్‌లో కనిపించేది. చూడటానికి ఈ కోచ్ చాలా రిచ్‌గా కనిపించేది. ఇక అరలున్న కోచ్‌లు ఇంగ్లాండ్‌లో తయారు చేశారు. ఇక దీనికి సబంధించిన బాడీని మాతుంగా వర్క్‌షాప్‌లో తయారు చేశారు. ప్రస్తుతం ఈ డెక్కన్ క్వీన్ ఎక్స్‌ప్రెస్ 17 కోచ్‌లతో పట్టాలపై పరుగులు తీస్తోంది. ఇందులో నాలుగు ఏసీ చైర్ కార్ బోగీలు, ఒక బఫెట్ కార్‌లు ఉన్నాయి. 10 సెకండ్ క్లాస్ చైర్ కార్లు, రెండు సాధారణ బోగీలు ఉన్నాయి.

English summary
As Deccan Queen enters its 90th year on Saturday, the train could soon cover its distance in lesser time. The decision to introduce the push and pull technique, which will reduce travel time, on Deccan Queen will be taken only if the trial on the Pune-Mumbai intercity express is successful, said senior officials, Central Railway Pune division.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X