బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Cap: నిద్రలో గురకను కంట్రోల్ చేసే మ్యాజిక్ టోపీ, టోపీ పెట్టుకుంటే గురక టక్కున ఆగిపోతుంది. వామ్మో !

గురకను కంట్రోల్ చేసే మ్యాగ్నటిక్ టోపీ వచ్చిందని, ఆ టోపీ పెట్టుకుంటే మీ గురక టక్కున ఆగిపోతుందని, మిమ్మల్ని చూసి విసుక్కునే వాళ్లు ఇప్పుడు మీకు దగ్గర అవుతారని ఓ కంపెనీ వేలాది మంది ఏంజెట్లతో మీటింగ్ పెట్టి లెక్చర్ ఇస్తున్న

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ముంబాయి: ఇంట్లో ఎవరైన నిద్రపోయే సమయంలో గురక పెడితే ఆ ఇంట్లో ఉన్న వాళ్లకు నిద్రరాకపోవడం, నిద్రపోతున్న వాళ్లు నిద్రలేచి ఇబ్బందులు పడటం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. గురకపెట్టే వాళ్లు కూడా నా కారణంగా ఇతరులు ఇబ్బందులు పడుతారని, గురక ఎలాగైనా మానేయాలని డాక్టర్లలను కలిసి చికిత్స చేసుకుంటున్నారు. గురకపెట్టే వారికి ఆ గురక పెద్ద సమస్యగా తయారైయ్యింది. ఇప్పుడు మార్కెట్ లోకి గురకను కంట్రోల్ చేసే మ్యాగ్నటిక్ టోపీ అందుబాటులోకి వచ్చిందని, ఆ టోపి పెట్టుకుంటే మీ గురక టక్కుల ఆగిపోతుందని, మిమ్మల్ని చూసి విసుక్కునే వాళ్లు ఇప్పుడు మీకు దగ్గర అవుతుందని ఓ కంపెనీ ముందుకు వచ్చింది. సిటీ మధ్యలోని ఓ ఫేమస్ భవనంలో వేలాది మందితో మీటింగ్ పెట్టి గురకను కంట్రోల్ చేసే మ్యాగ్నటిక్ టోపీ గురించి కంపెనీ యాజమాన్యం పెద్దగా లెక్చర్ ఇచ్చింది. ఆ సందర్బంలో పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో కథ రసవత్తరంగా మారిపోయింది.

Students: ఆంటీని బెదిరించి కాలేజ్ అబ్బాయిలు ఏం చేశారంటే ?, చెక్ పోస్ట్ లో ?Students: ఆంటీని బెదిరించి కాలేజ్ అబ్బాయిలు ఏం చేశారంటే ?, చెక్ పోస్ట్ లో ?

గురక టోపీ కంపెనీ యాజమాన్యం

గురక టోపీ కంపెనీ యాజమాన్యం

స్టాప్ స్నోరింగ్ పేరుతో క్యాప్ లు (టోపీలు) విక్రయిస్తే ఎక్కువ కమీషన్ ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేస్తున్న చైన్ లింక్ కంపెనీ అధినేత సహా నలుగురిని బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని ముంబాయికి చెందిన సునీల్ జోషి, బెంగళూరుకు చెందిన షేక్ సాదిక్ అలీ అలియాస్ షేక్, యోగేష్, ప్రమోద్ గోపీనాథ్‌ అలియాస్ గోపి అనే వ్యక్తులను అరెస్టు చేసి నిందితుల నుంచి కొన్ని పత్రాలు, గురక టోపీలతో ఉన్న కిట్‌లు స్వాధీనం చేసుకున్నామని హైగ్రౌండ్స్ పోలీసులు తెలిపారు.

బెంగళూరులో మీటింగ్

బెంగళూరులో మీటింగ్

బెంగళూరు ప్యాలెస్ గ్రౌండ్స్ సమీపంలోని వసంత్ నగర్ ఇటీవల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భవన్‌లో గురక టోపీ కంపెనీ నిర్వహకులు వారి ఏజెంట్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ-బియాటోరియం నెట్‌వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో కిట్‌లను మాగ్నెటిక్ కంటెంట్‌తో మ్యాజిక్ టోపీ (స్టాప్ స్నోరింగ్ క్యాప్) అని తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలకు విక్రయిస్తున్నారని బెంగళూరు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఇన్‌స్పెక్టర్ శివస్వామి నేతృత్వంలోని బృందం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భవన్ లోని ఎంట్రీ ఇచ్చారు. ఇదే సమయంలో పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

టోపీ పెట్టుకుంటే గురక టక్కున ఆగిపోతుంది

టోపీ పెట్టుకుంటే గురక టక్కున ఆగిపోతుంది

ముంబాయికి చెందిన సునీల్ జోషి కొద్ది రోజుల క్రితం ఈ-బయోటోరియం పేరుతో చైన్ లింక్ కంపెనీని ప్రారంభించాడు. తలపై అయస్కాంత పదార్థం ఉన్న టోపీని ధరించడం వలన నిద్రపోయేటప్పుడు గురక రాకుండా ఉంటుంది, గురక ఆగిపోవడంతో హాయిగా నిద్రపోవచ్చని ప్రచారం చేశాడు. ఓక్కో టోపీ ఉన్న కిట్ రూ. ఐదు వేలకు విక్రయిస్తున్నారని, అయస్కాంతం ఉన్న టోపీ తోపాటు టెక్స్‌టైల్ కిట్ విక్రయించాలని ప్లాన్ చేశాడు. ఈ కిట్ విక్రయిస్తే ఎక్కువ కమీషన్ వస్తుందని ఏజెంట్లను నమ్మించి మోసం చేసేందుకు సునీల్ జోషి ప్రయత్నించాడని బెంగళూరు పోలీసులు తెలిపారు.

సంక్రాంతి రోజు సూపర్ స్కెచ్

సంక్రాంతి రోజు సూపర్ స్కెచ్

జనవరి 15వ తేదీన పిరమిడ్ చైన్ లింక్ సిస్టమ్‌లో డిపాజిట్లు సేకరించేందుకు బయోటోరియం కంపెనీ వసంతనగర్‌లోని మిల్లర్‌ రోడ్డులోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ భవన్‌లో సుమారు వెయ్యి మందిని సమీకరించారు. ఈ కంపెనీలో ఎక్కువ మందిని చేర్చుకుంటే ఎక్కువ లాభం వస్తుందని అమాయక ప్రజలకు ఎర వేశారు. పలువురిని మోసం చేయాలనే ఉద్దేశంతో అంబేద్కర్ భవన్ లో సమావేశం నిర్వహిస్తున్నారని సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి చైన్ లింక్ నిర్వహకులను అదుపులోకి తీసుకున్నామని బెంగళూరు సెంట్రల్ డివిజన్ డీసీపీ శ్రీనివాసగౌడ్ మీడియాకు చెప్పారు.

చైన్ లింక్.... గురక టోపీల పేరుతో ఘరానామోసం

చైన్ లింక్.... గురక టోపీల పేరుతో ఘరానామోసం

చైన్ లింక్ కంపెనీలు ప్రారంభంలో చాలా మందిని నియమించుకుంటాయని, తరువాత మంచి కమీషన్‌ ఇస్తామని వివిధ రకాలుగా వారికి ఎర వేస్తారని. తరువాత అధిక కమీషన్ ఇస్తామని అనేక పత్రాలను సృష్టిస్తారని, సంస్థ కోసం కొత్త డిపాజిటర్లను ఆకర్షించడానికి మొదట కంపెనీలో ఉన్న ఏజెంట్లను రంగంలోకి దింపతుతారని పోలీసు అధికారులు అంటున్నారు. పాత ఏజెంట్లను ప్రోత్సహించి వారికి అధిక కమీషన్ ఇచ్చి కొత్త వారిని కంపెనీ వైపు ఆకర్షిస్తున్నారని డీసీపీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

కొత్త డిపాజిట్లు వసూలు చేసి

కొత్త డిపాజిట్లు వసూలు చేసి

ఇదే విధంగా చాలా మంది డిపాజిటర్ల నుంచి డబ్బు వసూలు చేసిన తరువాత వాళ్లు తమ కంపెనీని ఒక్కసారిగా మూసివేసి బోర్డు తిప్పేస్తారని అన్నారు. ఇలాంటి చర్యకు పాల్పడిన బయోటోరియం కంపెనీకి చెందిన నలుగురిని అరెస్టు చేసి ప్రజలకు జరిగే మోసాన్ని నివారించామని, బోగస్ కంపెనీ సొమ్మును ఇన్వెస్ట్ చేసిన వ్యక్తుల గురించి విచారణ జరుపుతున్నామని బెంగళూరు సెంట్రల్ డీసీపీ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

ముష్టి రూ. 300 టోపీ రూ. 5 వేలా ?

ముష్టి రూ. 300 టోపీ రూ. 5 వేలా ?

ఈ టోపీ పెట్టుకుంటే గురక పెట్టడం మానేస్తారని నమ్మించి మోసం చేస్తూ ఒక్కోటోపీని రూ. 5 వేలకు అమ్మేందుకు ప్రయత్నించారని, ఆ టోపీ ధర కేవలం 300 నుంచి 400 రూపాయల వరకు ఉంటుందని, ఆ టోపీలో అయస్కాంత మూలాలు లేవని, తప్పుడు ప్రచారంతో కంపెనీ నిర్వహకులు, వారి ఏజెంట్లు ఆటోపీలు విక్రయిస్తు ప్రజలకు నిజంగానే టోపీలు పెడుతున్నారని పోలీసులు తెలిపారు.

బ్యాంక్ అకౌంట్, రూ. 38 లక్షలు సీజ్

బ్యాంక్ అకౌంట్, రూ. 38 లక్షలు సీజ్

ముంబాయి

కంపెనీ యజమాని సునీల్‌ జోషికి చెందిన బ్యాంకు ఖాతాలు పోలీసు అధికారులు సీజ్ చేశారు. సునీల్ జోషి బ్యాంక్ అకౌంట్ లో రూ. 38 లక్షలు డబ్బు ఉందని, ఆ డబ్బును సీజ్ చేశామని, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని విచారణ చేస్తున్నామని డీసీపీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మొత్తం మీద గురుక టోపీతో ప్రజలకు కుచ్చుటోపీ పెడుతున్న నిర్వహకులు అరెస్టు కావడం బెంగళూరులో హాట్ టాపిక్ అయ్యింది.

English summary
Deception in the name of snoring hat mission. Hats off to the people indeed. Rs. 300 cap Rs. 5 thousand sale, chain link company magic in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X