వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంగాళాఖాతంలో అల్పపీడనం: పొంచివున్న తుఫాను ముప్పు!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలను ముంచెత్తుతున్న భారీ వర్షాలకు తుఫాను తోడు కానుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిన పలు రాష్ట్రాలకు తుఫాను ముప్పు పొంచివుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. వాయుగుండంగా మారుతోంది. మరో 48 గంటల్లో ఈ వాయుగుండం తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.

జమ్మూ కాశ్మీర్ లో పప్పులుడకట్లేదు: ఇక పంజాబ్ పై కన్ను.. హై అలర్ట్జమ్మూ కాశ్మీర్ లో పప్పులుడకట్లేదు: ఇక పంజాబ్ పై కన్ను.. హై అలర్ట్

మత్స్యకారులు చేపలు పట్టడానికి వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు. ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల సముద్ర తీర ప్రాంతానికి సమీపంలో ఈ అల్పపీడనం ఏర్పడింది. క్రమంగా వాయుగుండంగా మారుతోందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఒడిశాలోని బాలాసోర్ కు 130 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

deep depression likely to move across Odisha, West Bengal and North Andhra coast during next 48 hours, days IMD

క్రమంగా ఇది ఒడిశా వైపు కదులుతోందని అన్నారు. అల్పపీడన కేంద్రం పశ్చిమబెంగాల్ లోని దిఘా పట్టణానికి 100 కిలోమీటర్ల దూరం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఒడిశా, పశ్చిమబెంగాల్ లల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని సూచించారు. ఏపీ, ఒడిశా, దక్షిణ ఛత్తీస్ ఘడ్, దక్షిణ మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం, ఉత్తర తెలంగాణల్లో భారీ వర్షాలు నమోదు కావచ్చని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షపాతం నమోదవుతుందని పేర్కొన్నారు.

English summary
A depression over northwest Bay of Bengal of north Odisha and West Bengal coasts moved west-northwestwards with a speed of about 04 kmph in last six hours and lay centred at 11.30 pm on Tuesday, informed officials at RTGS, in secretariat on Wednesday. It is located about 100 km southeast of Balasore (Odisha) and about 90 km south-southeast of Digha (West Bengal). It is very likely to intensify into a Deep Depression
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X