చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విలీనం వెనుక..: శశికళ-పన్నీరులపై దీప బాంబు, మరో మలుపు ఖాయమని..

అన్నాడీఎంకే రెండు వర్గాల విలీనం పేరుతో ప్రస్తుతం జరుగుతున్నది అంతా ఓ కపట నాటకమని దివంగత జయలలిత సోదరుడి కుమార్తె దీప జయకుమార్ విమర్శించారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే రెండు వర్గాల విలీనం పేరుతో ప్రస్తుతం జరుగుతున్నది అంతా ఓ కపట నాటకమని దివంగత జయలలిత సోదరుడి కుమార్తె దీప జయకుమార్ విమర్శించారు.

<strong>పళనికి షాక్, పన్నీరుసెల్వం కొత్త డిమాండ్: ట్విస్ట్ మీద ట్విస్ట్ </strong>పళనికి షాక్, పన్నీరుసెల్వం కొత్త డిమాండ్: ట్విస్ట్ మీద ట్విస్ట్

మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ అవినీతిలో బాగా ఆరితేరినవారని విమర్శించారు. కొంతకాలంగా ఇద్దరి మద్య కొనసాగుతున్న విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయన్నారు.

అక్రమాలు బయటపడతాయనే

అక్రమాలు బయటపడతాయనే

దీంతో, గతంలో వీళ్లు చేసిన అక్రమాలన్ని ఈ గొడవలతో బయట పడుతాయని ప్లాన్‌తోనే శశికళ మళ్లీ ఏకమవుతున్నారని ఆరోపించారు. పన్నీర్‌సెల్వం ముందుగా తయారు చేసుకున్న స్కిప్టుతోనే ఇప్పుడు విలీనం అనే కపట నాటకాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు.

వింత నాటకంపై ప్రజలకు ఆసక్తి లేదు

వింత నాటకంపై ప్రజలకు ఆసక్తి లేదు

రాష్ట్ర ప్రజలు ఈ వింత నాటకాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారని దీప అన్నారు. త్వరలో ప్రజలే వాళ్లకు గుణపాఠం చెబుతారన్నారు. అన్నాడీఎంకే రెండు వర్గాలు విలీనం కోసం జరుగుతున్న ప్రయత్నాలపై ప్రజల్లో ఉద్రిక్తత గానీ, ఆసక్తిగానీ లేవని లేవని తేల్చి చెప్పారు.

శశికళను వెలివేయడం సాధ్యం కాదు

శశికళను వెలివేయడం సాధ్యం కాదు

శశికళ కుటుంబాన్ని పార్టీ నుంచి వెలివేయడం సాధ్యం కాదని అన్నాడీఎంకే అమ్మ పార్టీ అధికార ప్రతినిధి నాంజిల్‌ సంపత్ అన్నారు. అమ్మ వెంట 33 ఏళ్ల పాటు సహజీవనం చేసి అమ్మ ఆలోచనలతో పార్టీని నడిపేందుకు శశికళ కృషి చేశారన్నారు.

తమిళ రాజకీయాల్లో మరో కీలక మలుపు

తమిళ రాజకీయాల్లో మరో కీలక మలుపు

అలాంటి చిన్నమ్మ శశికళను పార్టీ నుంచి వెలివేయడం సాధ్యం కాదని నాంజిల్‌ సంపత్ అభిప్రాయపడ్డారు. తమిళ రాజకీయాల్లో మళ్లీ మరో కీలక మలుపు తిరగడం ఖాయమని ఆయన అన్నారు.

అర్ధరాత్రి షాక్

అర్ధరాత్రి షాక్

ఇదిలా ఉండగా అన్నాడీఎంకే పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి గెంటివేయబడ్డ దినకరన్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. బుధవారం అర్ధరాత్రి దినకరన్‌కు ఢిల్లీ పోలీసుల బృందం సమన్లు జారీ చేసింది. ఏసీపీ ర్యాంక్ ఆఫీసర్, ఆయన క్రైమ్ బ్రాంచ్ టీమ్, చెన్నై నివాసంలో ఉన్న దినకరన్‌కు సమన్లు జారీ చేశారని తెలుస్తోంది. దినకరన్ రెండాకుల గుర్తు కోసం ఈసికి రూ.50 కోట్లకు పైగా లంచం ఇవ్వచూపాడనే కేసు విచారణ జరుగుతోంది.

English summary
Merger on cards in AIADMK after FIR against Dinakaran.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X