వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయ మేనకోడలు దీపా భర్తను దూరం పెట్టి, మళ్లీ పిలిచిన పన్నీర్ !

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడులు దీపా జయకుమార్ ఎట్టకేలకు ఎంజీఆర్ అమ్మ దీపా పేరవైకు నిర్వహకులను నియమించారు. తమిళనాడు రాష్ట్రాన్ని నాలుగు జోన్లుగా విభజించి నిర్వహకుల పేర్లను దీపా వెల్లడించారు.

అదిలోనే హంసపాదు అన్నట్లుగా అనేక చోట్ల పదవుల వివాదం ఏర్పడింది. పూర్తి స్థాయి కమిటీ ఏర్పాటు మరింత జాప్యం తప్పదన్న ప్రచారం ఊపందుకుంది. ఇప్పుడే తలనొప్పులు ఎక్కువ కావడంతో ఇక ఆలస్యం చేస్తే మంచిదికాదని నిర్ణయించిన దీపా రాష్ట్రాన్ని నాలుగు డివిజన్లుగా విభజించి దీపా పేరవైకి నిర్వహకులను నియమించి తాత్కాలికంగా ఊపిరిపీల్చుకున్నారు.

తమిళనాడులో ఇవే డివిజన్లు

తమిళనాడులో ఇవే డివిజన్లు

మొదటి డివిజన్ లో కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, రామనాథపురం, విరుదునగర్, శివగంగై, తేని, మధురై జిల్లాలు చేర్చారు. రెండో డివిజన్ లో తిరుప్పూర్, దిండుగల్, నీలగిరి, కోయంబత్తూరు, నామక్కల్, ఈరోడ్, కరూర్, మూడో డివిజన్ లో తంజావూరు, కడలూరు, తిరుచ్చి, తిరువారూర్, పుదుకోటై, పెరంబూరు, కడలూరు, అరియలూరు, నాలుగో డివిజన్ లో క్రిష్ణగిరి, కాంచీపురం, వేలూరు, చెన్నై, తిరువళ్లూరు, క్రిష్ణగిరి, తిరువణ్ణామలై, ధర్మపురి, విల్లుపురం జిల్లాలు చేర్చారు.

దీపా బుజ్జగింపులు

దీపా బుజ్జగింపులు

జయలలిత జయంతి రోజు తాను రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన దీపా అమ్మ అభిమానుల్లో ఆనందాన్ని నిప్పింది. అదే సమయంలో పేరవై నిర్వహకులుగా తన మిత్రులు పలువుర్ని నియమించి వివాదాన్ని దీపా కొని తెచ్చుకున్నారు. అసమ్మతి మంటల్ని చల్లార్చేందుకు మద్దతుదారులను బుజ్జగించడానికి దీపా చాల శ్రమపడ్డారు.

భర్తను దూరం పెట్టిన దీపా జయకుమార్

భర్తను దూరం పెట్టిన దీపా జయకుమార్

దీపా ఇంటి ముందు గానీ, సమావేశాలకు గానీ మద్దతుదారులు సంఖ్య క్రమంగా తగ్గుతూ రావడంతో దీపా శిభిరంలో కలవరం మొదలైయ్యింది. తన ఇంటిలో ఉన్న వారికి దీపా ఎక్కవ ప్రాధాన్యం ఇస్తున్నారని, కావాలసిన వారికి పదవులు ఇచ్చారని ఆరోపణలు రావడంతో దీపా హడలిపోయారు. వెంటనే తన భర్త మాదవన్ కు, కారు డ్రైవర్ కు ఎలాంటి పదవులు ఇవ్వకుండా దీపా వారిని పూర్తిగా పక్కన పెట్టారు.

కొత్త పార్టీనా , మళ్లీ పిలిచిన పన్నీర్ సెల్వం

కొత్త పార్టీనా , మళ్లీ పిలిచిన పన్నీర్ సెల్వం

దీపా నాలుగు డివిజన్లలో ఇన్ చార్జ్ లు పలువురిని నియమించినా కొన్ని జిల్లాల్లో ఆ నాయకులను స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ఇదే సమయంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మళ్లీ దీపాకు పిలుపునివ్వడంతో ఆమె కొత్త పార్టీ పెడుతారా ? లేక పన్నీర్ సెల్వం వర్గంతో కలిసి పని చేస్తారా ? అనేది వేచిచూడాల్సిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఇన్ చార్జ్ లు వీరే

ఇన్ చార్జ్ లు వీరే

దురైయప్ప, పుసుంపాన్ పాండియన్, తొండన్ జీ సుబ్రమణి, సెంథిల్ మురుగన్, వీరకుమార్, భారతీ సుబ్బరాం, సరస్వతి, అమినన్, కరప్పుస్వామి, రాజామణి, రాజపరమశివం, ఇలవలగన్, మురుగన్, సెల్వవినాయగం, రాజకన్నప్పన్ పాండురంగన్, హేమచంద్రన్ లను ఇన్ చార్జ్ లు నియమించారు.

English summary
Jayalalithaa niece Deepa Jayakumar's husband Madhavan has left from MGR Amma Deepa peravai after some rifts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X