చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జయలలిత మేనకోడలు, దినకరన్ వర్గీయులు ఢిష్యూం ఢిష్యూం: ధైరంగా వెళ్లిన దీపా !

అన్నాడీఎంకే పార్టీ పదవి కోసం తమిళనాడు ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్న టీటీవీ దినకరన్ ఇప్పుడు మరో గొడవ పెట్టుకున్నాడు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ పదవి కోసం తమిళనాడు ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్న టీటీవీ దినకరన్ ఇప్పుడు మరో గొడవ పెట్టుకున్నాడు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా, ఆమె అనుచరులతో టీటీవీ దినకరన్ వర్గీయులు గొడవ పెట్టుకుని మరో వివాదానికి తెరలేపారు.

సీఎం ఎమ్మెల్యేల బలపరీక్షకు నో చాన్స్: హైకోర్టు, ఊపిరిపీల్చుకున్న పళని, పన్నీర్ !సీఎం ఎమ్మెల్యేల బలపరీక్షకు నో చాన్స్: హైకోర్టు, ఊపిరిపీల్చుకున్న పళని, పన్నీర్ !

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై 109వ పుట్టిన రోజు సందర్బంగా శుక్రవారం మౌంట్ రోడ్డులోని అన్నాదురై విగ్రహం దగ్గర నివాళులు అర్పించడానికి జయలలిత మేనకోడలు దీపా తన అనుచురులతో కలిసి వెళ్లారు. అప్పటికే అక్కడ టీటీవీ దినకరన్ వర్గీయులు వేచి ఉన్నారు.

 Deepa TTV Dinakaran followers clash with each other at chennai

మా నాయకుడు దినకరన్ ఇక్కడికి వస్తారని, మొదట ఆయనే అన్నాదురై విగ్రహానికి నివాళులు అర్పించాలని దీపాను అడ్డుకున్నారు. మొదట ఎవరు వస్తే వారే నివాళులు అర్పించాలని, మీనాయకుడు దినకరన్ పై నుంచి ఏమైనా దిగి వచ్చాడా అంటూ దీపా అనుచరులు ఎదురుతిరిగారు. ఆ సందర్బంలో దీపా, దినకరన్ వర్గీయులు ముష్టియుద్దానికి దిగారు.

సీఎం ఎఫెక్ట్: టీటీవీ దినకరన్, నటుడు సెంథిల్ మీద నాన్ బెయిల్ బుల్ కేసులు: ఏ క్షణంలో !సీఎం ఎఫెక్ట్: టీటీవీ దినకరన్, నటుడు సెంథిల్ మీద నాన్ బెయిల్ బుల్ కేసులు: ఏ క్షణంలో !

దీపా ధైర్యంగా ముందుకు వెళ్లి అన్నాదురై విగ్రహానికి నివాళులు అర్పించారు. గొడవ జరుగుతున్న సమయంలోనే అన్నాదురై విగ్రహానికి నివాళులు అర్పించిన దీపా తన అనుచరులతో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీపా వెళ్లిన 30 నిమిషాల తరువాత దినకరన్ మౌంట్ రోడ్డులోని అన్నాదురై విగ్రహం దగ్గరకు చేరుకుని నివాళులు అర్పించారు.

జయలలిత వారసులు మేమే అని చెప్పుకుంటున్న దినకరన్ చివరికి అమ్మ మేనకోడలు దీపా మీదకు తన అనుచరులను రెచ్చగొట్టడంతో అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు మన్నార్ గుడి మాఫియా మీద మండిపడుతున్నారు. ఈ విషయంపై మీడియా దినకరన్ ను ప్రశ్నిస్తే నోకామెంట్ అంటూ అక్కడి నుంచి చిన్నగా జారుకున్నాడు.

English summary
Deepa and TTV Dinakaran followers clash with each other at Chennai, when both the leaders comes to felicitate Anna statue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X