వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత మృతి: దీపా, దీపక్ విచారణ, జయ మీద దాడి చేశారు, శశికళ ఫ్యామిలీ !

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై ఉన్న అనుమానాలు తొలగించాడానికి ఏర్పాటు చేసిన మద్రాసు హైకోర్టు రిటైడ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ముందు అమ్మ మేనలుడు దీపక్ జయకుమార్ విచారణకు హాజరైనారు.

దీపక్ కు పలు ప్రశ్నలు

దీపక్ కు పలు ప్రశ్నలు

చెన్నైలోని కలాస మహల్ లోని కార్యాలయంలో జయలలిత మేనల్లుడు దీపక్ ను విచారణ చేసిన ఆర్ముగస్వామి కమిషన్ పలు కీలక విషయాలు తెలుసుకున్నారు. అమ్మ జయలలిత మేనలుడు దీపక్ కు ఆర్ముగస్వామి విచారణ కమిషన్ పలు ప్రశ్నలు వేసింది.

అమ్మ ఆరోగ్యం ఎలా ఉండేది !

అమ్మ ఆరోగ్యం ఎలా ఉండేది !

జయలలిత ఆరోగ్యం ఎలా ఉండేదని, ఆమె వ్యక్తిగత విషయాలే ఏమిటని రిటైడ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి దీపక్ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారని తెలిసింది. విచారణ అనంతరం మళ్లీ పిలిచినప్పుడు రావాలని ఆర్ముగస్వామి జయలలిత మేనల్లుడు దీపక్ చెప్పి పంపించారు.

ఇప్పటికే అందర్ని ?

ఇప్పటికే అందర్ని ?

ఇప్పటికే ఆర్ముగస్వామి విచారణ కమిషన్ జయలలిత మేనకోడలు దీపా భర్త మాధవన్, తమిళనాడు ప్రభుత్వ వైద్యులు, పోయెస్ గార్డెలో పని చేస్తున్న 15 మందిని, తిరుపరకుప్పం ఉప ఎన్నికల్లో పోటీ చేసిన డీఎంకే పార్టీ నాయకుడు డాక్టర్ శరవణన్ ను విచారణ చేసి వివరాలు సేకరించారు.

మేనకోడలు దీపా హాజరు

మేనకోడలు దీపా హాజరు

జయలలిత మేనకోడలు దీపా సైతం బుధవారం ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ముందు హాజరైకు వివరణ ఇచ్చారు. ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ముందు పలు విషయాలు చెప్పిన దీపా జయకుమార్ తరువాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.

 నమ్మకం ఉంది

నమ్మకం ఉంది

ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ముందు తాను అనేక విషయాలు వివరించానని జయలలిత మేనకోడలు దీపా మీడియాకు చెప్పారు. మా మేనత్త జయలలిత మరణం విషయంలో నిస్పక్షపాతంగా విచారణ జరుగుతోందనే నమ్మకం ఉందని దీపా అన్నారు.

జయ మీద దాడి జరిగింది !

జయ మీద దాడి జరిగింది !

మా మేనత్త జయలలితను ఆసుపత్రిలో చేర్పించే ముందు ఆమె మీద కొందరు దాడి చేశారని దీపా జయకుమార్ ఆరోపించారు. శశికళతో సహ ఆమె కుటుంబ సభ్యులు అందర్నీ విచారణ చెయ్యాలని తాను ఆర్ముగస్వామి కమిషన్ కు మనవి చేశానని దీపా జయకుమార్ వివరించారు.

English summary
A day after Deepa Jayakumar appeared before the inquiry commission probing the death of former chief minister J Jayalalithaa and made some shocking claims, her brother Deepak Thursday presented himself before justice Arumughaswamy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X