• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తన మేనేజర్ తో డ్రగ్ చాటింగ్ నిజమేనన్న దీపికా పదుకొనే .. ఎన్సీబీకి ప్రశ్నలకు సరిగా సమాధానం చెప్పకుండా

|

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో దీపికా పదుకొనేను విచారించారు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) అధికారులు. నిన్నటికి నిన్న ఈ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ ను విచారించిన అధికారులు ఆమె నుండి కీలక సమాచారం రాబట్టారు. రకుల్ డ్రగ్స్ చాట్ చేసినట్టు అంగీకరించారు. నేడు విచారణలో దీపికా పదుకొనే కూడా తన మేనేజర్ కరిష్మా ప్రకాష్ తో డ్రగ్స్ చాట్ చేసినట్టు ఒప్పుకున్నారు. కానీ ఆమె ఆమె నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇవ్వలేదని తెలుస్తుంది .

2017లో తన మేనేజర్ కరిష్మాతో డ్రగ్స్ చాటింగ్స్ .. ఒప్పుకున్న దీపిక

2017లో తన మేనేజర్ కరిష్మాతో డ్రగ్స్ చాటింగ్స్ .. ఒప్పుకున్న దీపిక

తన మేనేజర్ కరిష్మా ప్రకాష్ తో తాను డ్రగ్స్ చాట్ చేసిన విషయం నిజమేనని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ముందు అంగీకరించిన దీపికాపదుకొనె 2017 లో తను, కరిష్మా డ్రగ్స్ గురించి వాట్సాప్ చాటింగ్ చేశామని పేర్కొంది. బాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణలో భాగంగా ఐదు గంటల పాటు దీపికా పదుకొనేను విచారించారు నార్కోటిక్స్ అధికారులు .అయితే నార్కోటిక్స్ అధికారుల ప్రశ్నలకు మాత్రం దీపికా పదుకొనే సంతృప్తికరమైన సమాధానాలు చెప్పలేదని సమాచారం.

 దీపిక బాటలో కరిష్మా ప్రకాష్ ... ఎన్సీబీ ప్రశ్నలకు నో ఆన్సర్

దీపిక బాటలో కరిష్మా ప్రకాష్ ... ఎన్సీబీ ప్రశ్నలకు నో ఆన్సర్

ఈరోజు దీపికా పదుకొనే మేనేజర్ కరిష్మా ప్రకాష్ ను కూడా దీపిక తో పాటు విచారించిన అధికారులు వారిద్దరినీ ఏకకాలంలో ప్రశ్నించారు. దీపికా పదుకొనే తరహాలోనే కరిష్మా ప్రకాష్ కూడా నార్కోటిక్స్ అధికారులకు సహకరించలేదని సమాచారం. దీపికా పదుకొనేను ప్రశ్నించే ముందు అధికారులు ఆమె వద్ద ఉన్న సెల్ ఫోన్ ను బయటపెట్టాలని సూచించినట్లుగా తెలుస్తోంది. . డ్రగ్స్ వ్యవహారంలో దీపికా పదుకొనే పాత్రను విచారించిన నార్కోటిక్స్ అధికారులు 2017 లో కోకో క్లబ్ లో జరిగిన పార్టీ గురించి ఆమెకు పలు ప్రశ్నలు సంధించారు. కానీ ఆమె సరిగ్గా సమాధానం చెప్పలేదు .

 రణ్ వీర్ సింగ్ తో కలిసి ఓ స్టార్ హోటల్ లో లీగల్ స్ట్రాటజీ ప్లాన్ చేసిన దీపిక

రణ్ వీర్ సింగ్ తో కలిసి ఓ స్టార్ హోటల్ లో లీగల్ స్ట్రాటజీ ప్లాన్ చేసిన దీపిక

నార్కోటిక్స్ అధికారులు దీపికా పదుకొనేకు డ్రగ్స్ కేసులో విచారణకు హాజరు కావాలని సమన్లు పంపించిన నేపధ్యంలో ఆమె నిన్న రాత్రి రణ్ వీర్ సింగ్ తో కలిసి ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో 12మంది లాయర్లతో తమ లీగల్ స్ట్రాటజీని చర్చించారు . బాలీవుడ్ ను షేక్ చేస్తున్న ఈ కేసులో దీపికా పదుకొనే ఈ రోజు విచారణ సంతృప్తికరంగా లేకపోవటంతో , ఈ కేసులో మరి కొంత మంది విచారణ అనంతరం మరోమారు దీపికా పదుకొనేను విచారించే అవకాశం లేకపోలేదు .

 డ్రగ్స్ వాట్సప్ గ్రూప్ కు అడ్మిన్ దీపికానే .. సారా అలీఖాన్, శ్రద్ధా ఏం చెప్తారో ?

డ్రగ్స్ వాట్సప్ గ్రూప్ కు అడ్మిన్ దీపికానే .. సారా అలీఖాన్, శ్రద్ధా ఏం చెప్తారో ?

అయితే దీపికా పదుకొనే వారి ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెప్పలేదని తెలుస్తుంది. ముఖ్యంగా డ్రగ్స్ వ్యవహారంలో సెలబ్రిటీలకు చెందిన ఈ వాట్సాప్ గ్రూప్ కు దీపికా పదుకొనే అడ్మిన్. ఈ కోణంలో కూడా ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించింది నార్కోటిక్స్. కానీ దీపికా పదుకొనే మాత్రం నార్కోటిక్స్ అధికారులకు అసంతృప్తి కరమైన సమాధానాలను ఇచ్చారని సమాచారం . నార్కోటిక్స్ అధికారులు ఈ రోజు సారా అలీ ఖాన్ , శ్రద్ధా కపూర్ లను కూడా విచారించారు . వారు కీలక సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది.

English summary
In relation with the drugs case and sushanth singh raj puth death the NCB questioned deepika padukone and also her manager karishma prakash .deepika confessed she done drugs chat with her manager karishma in 2017. Deepika and her manager karishma not responded properly to the NCB questions .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X