• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నటి దీపికా పడుకొన్ సంచలన వ్యాఖ్యలు.. రోజరోజుకూ దిగజారుతోంది.. అందుకే కొపమొచ్చింది..

|
  #Boycottchhapaak Is Trending, Deepika Padukone JNU Visit Leaves Twitter Divided || Oneindia Telugu

  ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)లో దుడగుల దాడిలో గాయపడ్డ విద్యార్థుల్ని పరామర్శించడంపై పెద్ద ఎత్తున విమర్శలకు నటి దీపికా పదుకొనె ఘాటుగా బదులిచ్చారు. తన కొత్త సినిమా 'చపాక్' ప్రమోషన్ కోసం ఢిల్లీకి వచ్చిన ఆమె.. మంగళవారం రాత్రి జేఎన్‌యూకు వెళ్లి విద్యార్థుల నిరసనలో పాలుపంచుకున్నారు. అరగంటకుపైగా క్యాపస్ లోనే ఉన్నారు. దుండగుల దాడిలో గాయపడ్డ స్టూడెంట్ యూయిన్ ప్రెసిడెంట్ ఐషే ఘోష్, ఇతర విద్యార్థుల్ని దీపిక పరామర్శించారు. నటి చర్యను తప్పుపట్టిన బీజేపీ, ఇతర హిందూ సంఘాలు ఆమె సినిమాల్ని బహిష్కరించాలని పిలుపునిచ్చారు.

  హింస సాధారణ విషయమైతే ఎలా?

  హింస సాధారణ విషయమైతే ఎలా?

  జేఎన్‌యూ సందర్శనపై మీడియాతో మాట్లాడిన దీపిక సంచలన కామెంట్లు చేశారు. ‘‘ఇవాళ నేను కొత్తగా మాట్లాడేదేమీ లేదు. నేను చెప్పదల్చుకున్నది రెండేళ్ల కిందటే.. పద్మావత్ సినిమా విడుదల టైమ్ లోనే చెప్పేశా. ఆరోజు నేను దేనికి భయపడ్డానో ఇప్పటికీ అదే జరుగుతోంది. పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నట్లనిపిస్తోంది. ఎవరుపడితేవాళ్లు ఏదైనా మాట్లాడేసి, వ్యతిరేకించినవాళ్లపై దాడులు చేయడం దారుణం. హింస అనేది ఒక సాధారణ విషయంగా మారిపోవడం చాలా బాధాకరం. ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పగలను.. మన దేశం నిలబడింది ఈ రకమైన పునాదులమీద కాదు''అని వివరించారు.

  అప్పుడు ఇంకా కోపమొచ్చింది..

  అప్పుడు ఇంకా కోపమొచ్చింది..

  నొప్పి బాధేంటో తెలుసు కాబట్టే జేఎన్‌యూలో దెబ్బలుతిన్న విద్యార్థుల్ని పరామర్శించానని దీపిక తెలిపారు. విద్యార్థులపై దుండగులు విచక్షణా రహితంగా దాడి చేయడం ఒకటైతే.. పోలీసులు కనీసమాత్రంగానైనా స్పందిచక పోవడం, నిందితులపై యాక్షన్ తీసుకోకపోవడం బాగా కోపం తెప్పించిందని ఆమె చెప్పారు.

  చపాక్ సినిమాపై పొలిటికల్ లొల్లి

  చపాక్ సినిమాపై పొలిటికల్ లొల్లి

  యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మి అగర్వాల్ జీవితగాథ ఆధారంగా దీపిక లీడ్ రోల్ లో నటించిన ‘చపాక్'సినిమా వివాదంలో చిక్కుకుంది. జేఎన్‌యూ స్టూడెంట్లకు దీపిక మద్దతివ్వడంపై బీజేపీ మండిపడింది. శుక్రవారం(ఈనెల 10న) విడుదల కానున్న చపాక్ తోపాటు దీపిక మిగతా సినిమాలను బహిష్కరించాలంటూ ఢిల్లీ బీజేపీ కీలక నేత తేజిందర్ సింగ్ బగ్గా ఇచ్చిన పిలుపును దేశవ్యాప్తంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు సమర్థంచారు. చపాక్ సినిమాను అడ్డుకుంటామని పలువురు నేతలు ప్రకటనలు చేశారు.

  English summary
  After Visiting JNU, Actress Deepika Padukone Made Sensational Comments On Violence And The Present Conditions In the country. I fear and I'm sad She said. This is not the foundation of our country, She added
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X