వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జేఎన్‌యూలో దీపికా పదుకొనె: విద్యార్థులకు పరామర్శ, మౌనంగానే.., ‘ఆమె సినిమాలు చూడొద్దంటూ..’

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)లో జరిగిన దాడిలో గాయపడిన విద్యార్థులను ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మంగళవారం రాత్రి పరామర్శించారు. జేఎన్‌యూకి వెళ్లిన దీపిక దాదాపు 15 నిమిషాలపాటు విద్యార్థులతో గడిపారు.

విద్యార్థి నేతలకు దీపిక పరామర్శ..

విద్యార్థి నేతలకు దీపిక పరామర్శ..

అయితే, విద్యార్థులకు సంఘీభావం తెలిపిన దీపికా పదుకొనె ఏం మాట్లాడకుండానే ఉండటం గమనార్హం. మంగళవారం రాత్రి 7.30గంటల ప్రాంతంలో ఆమె యూనివర్సిటీకి వచ్చారు. జేఎన్‌యూ ఎస్‌యూ అధ్యక్షురాలు ఐషే ఘోష్‌ను ఆమె పరామర్శించారు. ఆ తర్వా మరి కొంతమంది విద్యార్థులను కలిసి మాట్లాడారు.

మౌనంగానే వెనుదిరిగిన దీపిక..

దాదాపు 15 నిమిషాలపాటు అక్కడేవున్న దీపికా పదుకొనె ఏమీ మాట్లాడకుండానే వెళ్లిపోయారు. దీపిక వర్సిటీని సందర్శించిన సమయంలో జేఎన్‌యూ ఎస్‌యూ మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ కూడా అక్కడే ఉన్నారు.

దీపిక సినిమాలు చూస్తారా? అంటూ..

కాగా, దీపికా పదుకొనె జేఎన్‌యూను సందర్శించిన నేపథ్యంలో బీజేపీ నేత తేజేందర్ సింగ్ బగ్గా ఆమెపై తీవ్రంగా స్పందించారు. టుక్డే టుక్డే గ్యాంగ్, అఫ్జల్ గ్యాంగ్‌కు మద్దతు పలుకుతున్న దీపికా పదుకొనె సినిమాలను బహిష్కరించాలంటూ ఆయన పిలుపునిచ్చారు. ఆయనతోపాటు పలువురు బీజేపీ నేతలు కూడా ఆమెపై మండిపడుతున్నారు.

విద్యార్థులపై దాడి.. ఆ సంస్థ బాధ్యత

విద్యార్థులపై దాడి.. ఆ సంస్థ బాధ్యత


కాగా, ఆదివారం సాయంత్రం కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు ముసుగులు ధరించి జేఎన్‌యూ ప్రవేశించారు. ఆ తర్వాత పలువురు విద్యార్థులతోపాటు ప్రొఫెసర్లపైనా దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. తీవ్ర గాయాలపాలైన విద్యార్థులు, అధ్యాపకులు ఆస్పత్రిలో చికిత్స అనంతరం కోలుకున్నారు. ఈ దాడిని కేంద్ర ప్రభుత్వ పెద్దలతోపాటు ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. దేశంలోని పలు యూనివర్సిటీల విద్యార్థులు దాడికి నిరసనగా భారీ ప్రదర్శనలు చేపట్టారు. కాగా, విద్యార్థులపై దాడి చేసింది తామేనంటూ హిందూ రక్షాదళ్ అనే సంస్థ ప్రకటించడం గమనార్హం.

English summary
Deepika Padukone left her fan clubs and the national capital buzzing on Tuesday evening when she decided to drop in on the students at the Jawaharlal Nehru University.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X