హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

క్రూరంగా హింసించే పద్దతిని వీడండి.. మహిళా డాక్టర్ రేప్‌పై ప్రియాంక గాంధీ ఎమోషనల్

క్రూరంగా హింసించే పద్దతిని వీడండి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: శంషాబాద్‌లో సామూహిక అత్యాచారానికి, హత్యకు గురైన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి ఘటనపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ట్విట్టర్ వేదికగా ఆమె వ్యాఖ్యానించారు.

ప్రియాంక రెడ్డి హత్య: పోలీసుల తీరుపై మహిళా జాతీయ కమిషన్ సభ్యురాలి ఆగ్రహంప్రియాంక రెడ్డి హత్య: పోలీసుల తీరుపై మహిళా జాతీయ కమిషన్ సభ్యురాలి ఆగ్రహం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంభల్‌లో కూడా ఓ యువతిపై ఇలాంటి దారుణమే జరిగింది. ఈ రెండు ఘటనలు తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయని అన్నారు ప్రియాంక గాంధీ వాద్రా. ఇలాంటి ఘటనలు జరిగిన సమయంలోనే మనమంతా మహిళల భద్రత గురించి మాట్లాడుకుంటున్నాం.. ఆ తర్వాత మరిచిపోతున్నామని అన్నారు.

Deeply disturbed over rape-murder incidents in Hyderabad, SaDeeply disturbed over rape-murder incidents in Hyderabad, Sambhal: Priyanka Gandhi

మన మనస్తత్వాలు మారాలని, మహిళలను క్రూరంగా హింసించే అసహ్యకరమైన పద్దతిని విడనాడాలని ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. కాగా, బుధవారం రాత్రి శంషాబాద్‌లో డాక్టర్ ప్రియాంకను నలుగురు నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడి, అనంతరం ఆమెను దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని పెట్రోల్ పోసి కాల్చివేశారు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. 14 రోజులపాటు వారిని రిమాండ్‌కు తరలించారు. ప్రియాంక ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నిందితులను వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు.

కాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంభల్ ప్రాంతంలో ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఆమె పొరుగింటి వ్యక్తి. ఆ తర్వాత ఆమెను సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించాడు.. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతుతూ ఆదివారం ఉదయం ప్రాణాలు వదిలింది.

English summary
Congress general secretary Priyanka Gandhi Vadra on Saturday said that she was deeply disturbed over the rape and murder of a 26-year-old veterinarian in Hyderabad and a teenager in Uttar Pradesh's Sambhal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X