వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిర్భయ కలకలం: ఉరి ఎందుకు తీయలేదని నిలదీత, బీబీసీపై ఆగ్రహం

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నిర్భయ డాక్యుమెంటరీ పైన పార్లమెంటులో చర్చ సాగింది. ఈ డాక్యుమెంటరీ పైన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం వివరణ ఇచ్చారు. నిర్భయ డాక్యుమెంటరీ పైన విపక్షాలు భగ్గుమన్నాయి. విషయాన్ని సీరియస్‌గా పరిగణించాలని సభాపతిని కోరాయి. దానికి రాజ్‌నాథ్ రాజ్యసభలో స్పందించారు.

డాక్యుమెంటరీ పైన విచారణకు ఆదేశించామని చెప్పారు. బాధ్యుల పైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బీబీసీకి డాక్యుమెంటరీకి షరతులతో కూడిన అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. ఒప్పందం ప్రకారం బీబీసీ ప్రతినిధులు వ్యవహరించలేదని చెప్పారు. ఈ డాక్యుమెంటరీ అందరి గుండెల్ని గాయపర్చిందన్నారు.

నివేదిక ఆధారంగా బాధ్యుల పైన చర్యలు ఉంటాయని చెప్పారు. మహిళల పట్ల తమ ప్రభుత్వానికి గౌరవం ఉందని చెప్పారు. ఇంటర్వ్యూ ఫుటేజీని బీబీసీ నుండి తీసేసుకున్నట్లు చెప్పారు.

 Deeply hurt, won't allow telecast of Nirbhaya documentary, says Rajnath Singh

ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ... జైలులో ఉంటున్న నిందితుల ఇంటర్వ్యూ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం స్పందన పైన బీఎస్పీ అధినేత్రి, ఎంపీ మాయావతి హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చర్యను ఆమె మెచ్చుకున్నారు.

కాగా, మహిళా ఎంపీలు పలువురు రాజ్యసభలో ప్రభుత్వాన్ని నిలదీశారు. నిర్భయ కేసులో నిందితులను ఇంకా ఎందుకు ఉరితీయలేదని ప్రశ్నించారు. ఎంపీ జయాబచ్చన్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం మొసలి కన్నీరు అవసరం లేదని మండిపడ్డారు.

బీబీసీకి నోటీసులు

ఢిల్లీ పోలీసులు బీబీసీకి నోటీసులు ఇచ్చారు. ఒప్పందాన్ని ఉల్లంఘించారనే అభియోగం పైన నోటీసులు ఇచ్చారు.

English summary
There is outrage and anger after excerpts of an interview of a December 16 gang-rape convict came into public domain. The interview was taken for a BBC documentary and was to be telecast later this week. However, the government has advised media not to telecast the same and the Delhi Police have also secured a restraining order from a court against telecast of the interview.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X