వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరద తెచ్చిన తంటా.. నదిని తలపిస్తోన్న కజిరంగ పార్కు... కొట్టుకుపోతున్న జింక, వైరలైన వీడియో

|
Google Oneindia TeluguNews

గౌహతి : చినుకు పడితే చాలు .. మానవాళికే కాస్త ఇబ్బంది, ఇక భారీ వర్షాలు.. వరదలైతే చెప్పక్కర్లేదు. కుంభవృష్టికి విజ్ఞులైన మనుషులే అపసోపాలు పడతారు. ఇక మూగజీవాల పరిస్థితి ఏంటీ ? తమ బాధను ఎవరితో చెప్పుకుంటాయి. వాటి రోదన అరణ్యరోదనేనా ? అంటే ఔననే సమాధానం వస్తోంది. అసోంలో ఇటీవల భారీ వర్షబీభత్సం అతలాకుతలం చేసింది. అయితే వర్షంతో కూడిన వరదనీరు కజిరంగ జాతీయ పార్కును కూడా ముంచెత్తింది. దీంతో అందులో ఉండే మూగజీవాలు బిక్కుబిక్కుమంటున్నాయి.

బిక్కుబిక్కుమంటున్న మూగజీవాలు
కజిరంగ పార్కును కూడా వర్షాలు ముంచెత్తాయి. దీంతో పార్కు మొత్తం నీటితో నిండిపోయింది. అయితే అందులో ఓ జింక కూడా కొట్టుకుపోతూ కనిపించింది. జింకతోపాటు ఖగ్గమృగాలు, ఏనుగులు కూడా వరదనీటితో అపసోపాలు పడుతున్నాయి. ఓ జింక వరదనీటిలో ఉన్న 2 నిమిషాల నిడివి గల సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనిపై ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీన్ స్పందిస్తూ .. అసోంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులతో మూగజీవాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. ఓ జింక వరదనీటిలో పడుతున్న ఇబ్బందిని చూశామని పేర్కొన్నారు. దాదాపు 90 శాతం పార్క్ వరదనీటితో నిండిపోయిందనే కఠోర నిజాన్ని వెల్లడించారు. విపత్తు మూగజీవాలపై కూడా ప్రభావం చూపిందని .. విపత్కర పరిస్థితిని అవి కూడా ఎదుర్కొంటున్నాయని ట్వీట్ చేశారు.

Deer swept away in Assam floods captured in viral video from Kaziranga. Internet is devastated

ఆయన చేసిన పోస్ట్‌ను చాలామంది షేర్ చేయడంతో వైరలైంది. అంతేకాదు కజిరంగలో ఉన్న ప్రస్తుత పరిస్థితి వీడియో చూస్తే అద్దం పడుతుందని నెటిజన్లు అంటున్నారు. ట్వీట్‌తో కజరింగలో సిచుయేషన్ తెలిసిందని .. వెంటనే సహాయ చర్యలు చేపట్టాలని మరో నెటిజన్ కోరారు. అసోంలో కురుస్తోన్న భారీ వర్షాలతో దాదాపు వెయ్యి మంది సైనికులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. పార్కులో జంతువులు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని ఎమ్మెల్యే మృణాల్ సేన్ పేర్కొన్నారు. జింకలు, ఖడ్గమృగాలు, ఏనుగులు ఇబ్బందికర సిచుయేషన్ ఎదుర్కొంటున్నాయని తెలిపారు. బ్రహ్మాపుత్ర నదీ గుండా .. కజిరంగ పార్క్ ఉన్న సంగతి తెలిసిందే. దీంతో వరదనీరు వేగంగా పార్కులోకి చేరుకుంటోంది.

English summary
As floods in Assam worsened with incessant rain, a video of deer wading through deep waters in the Kaziranga National Park surfaced online on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X