పరువు నష్టం దావా: ఇల్మీకి బెయిలబుల్ వారంట్
న్యూఢిల్లీ: పరువు నష్టం దావాలో కోర్టుకు హాజరు కానందుకు ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసిన షాజియా ఇల్మీపై ఢిల్లీ కోర్టు శనివారం బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. ఆమెపై, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌పై మాజీ మంత్రి కపిల్ సిబాల్ కుమారుడు అమిత్ సిబాల్ పరువు నష్టం దావా వేశారు.
తమ ముందు హాజరు కాకపోవడంతో కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కేజ్రీవాల్‌ను, పార్టీ ఇతర నాయకులు మనీష్ సిసోడియా, ప్రశాంత్ భూషణ్, ఇల్మీలను కోర్టు గత నెల హెచ్చరించింది. సమన్లు జారీ చేసినప్పటికీ తమ ముందు హాజరు కాకపోవడంతో ఇల్మీకి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సునీల్ కుమార్ శర్మ బెయిలబుల్ అరెస్టు వారంట్ జారీ చేశారు.

రూ. 5వేల రూపాయలతో కూడిన బెయిలబుల్ వారంట్‌ను జారీ చేసినట్లు మెజిస్ట్రేట్ చెప్పారు. ప్రశాంత్ భూషణ్ కోర్టుకు హాజరయ్యారు. మే 22వ తేదీన తండ్రి మరణి్ంచడంతో సోసిడియాకు కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది.
మరో కేసులో జైలులో ఉన్నందున కేజ్రీవాల్‌కు మినహాయింపు కోరుతూ మరో దరఖాస్తు వేయాలని మెజిస్ట్టేర్ ఆయన తరఫున వాదనలు వినిపిస్తున్న శాంతి భూషన్‌కు సూచించారు. ఆగస్టు 23వ తేదీ కేజ్రీవాల్ హాజరయ్యే విధంగా చూడాలని న్యాయమూర్తి ఆదేశించారు.












Click it and Unblock the Notifications