బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మీడియాకు వార్నింగ్ ఇచ్చిన డీకే బ్రదర్: పరువునష్టం కేసులు పెట్టి, ఏం అనుకుంటున్నారు ?

కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ కు విరుద్దంగా వార్తలు ప్రసారం చేసినా, దినపత్రికల్లో కథనాలు ప్రచురించినా అలాంటి మీడియా మీద పరువునష్టం దావా వేసి కోర్టుకు ఈడ్చుతామని ఆయన సోదరుడు డీకే.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ కు విరుద్దంగా వార్తలు ప్రసారం చేసినా, దినపత్రికల్లో కథనాలు ప్రచురించినా అలాంటి మీడియా మీద పరువునష్టం దావా వేసి కోర్టుకు ఈడ్చుతామని ఆయన సోదరుడు డీకే. సురేష్ శుక్రవారం వార్నింగ్ ఇచ్చారు.

ఐటీ దాడులు: మొత్తం డబ్బు అంతా మాది కాదు, మంత్రి తమ్ముడు రివర్స్ గేర్, మరెవరిది?ఐటీ దాడులు: మొత్తం డబ్బు అంతా మాది కాదు, మంత్రి తమ్ముడు రివర్స్ గేర్, మరెవరిది?

బెంగళూరు గ్రామీణ జిల్లా లోక్ సభ నియోజకవ వర్గం ఎంపీ (కాంగ్రెస్) డీకే. సురేష్ శుక్రవారం బెంగళూరులోని సదాశివనగర్ లోని తన సోదరుడు, మంత్రి డీకే. శివకుమార్ ను కలుసుకోవడానికి ప్రయత్నించారు. అయితే ఆదాయపన్ను శాఖ అధికారులు అందుకు అవకాశం ఇవ్వలేదు.

 Defamation case will be filed against media spreading false news: DK Suresh

ఈ సందర్బంగా డీకే. శివకుమార్ ఇంటి బయట ఎంపీ డికే. సురేష్ మీడియాతో మాట్లాడారు. మాకు పార్టీ కార్యకర్తల అండ ఉందని, బీజేపీ నాయకులు ఎాన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మమల్ని ఏమీ చెయ్యలేరని బీజేపీ పార్టీ నాయకుల మీద మండిపడ్డారు. రాజకీయ కక్షతోనే ఆదాయపన్ను శాఖతో దాడులు చేయించారని ఆరోపించారు.

మోడీ షాక్: ఐటీ దెబ్బ, పండగ రోజు వదల్లేదు, మంత్రి ఇంటిలోనే సోదాలు, నిద్ర !మోడీ షాక్: ఐటీ దెబ్బ, పండగ రోజు వదల్లేదు, మంత్రి ఇంటిలోనే సోదాలు, నిద్ర !

ఆదాయపన్ను శాఖ దాడులు మొదలు పెట్టిన తరువాత డీకే. శివకుమార్ పరువు, ప్రతిష్ట దెబ్బ తియ్యడానికి కొన్ని మీడియా సంస్థలు ప్రయత్నిస్తున్నాయని, అలాంటి వారి మీద పరువునష్టం దావా వేస్తామని డీకే. సురేష్ హెచ్చరించారు. ఇప్పటి వరకూ ఆదాయపన్ను శాఖ అధికారులు ఎలాంటి వివరాలు బయటకు చెప్పకున్నా మీడియా మాత్రం ఇష్టం వచ్చినట్లు వార్తలు ప్రసారం చేస్తున్నాయని, అలాంటి వారిని విడిచిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు.

English summary
IT raid on Karnataka Energy Minister DK Shivakumar house: Defamation case wil be filed against some of the media for spreading false news on IT Raid, MP DK Suresh warning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X