వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అభినందన్‌ను కలిసిన రక్షణశాఖ మంత్రి...దేశం నిన్ను చూసి గర్వపడుతోందన్న నిర్మలాసీతారామన్

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: పాకిస్తాన్‌కు పట్టుబడిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ శుక్రవారం రాత్రి 9:15 గంటలకు భారత భూభాగంపై అడుగుపెట్టారు. ప్రస్తుతం వైద్య పరీక్షల కోసం ఢిల్లీ హాస్పిటల్‌లో ఉన్న అభినందన్‌ను రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. జాతి యావత్తు తాను చూపిన ధైర్యాన్ని, పరాక్రమాన్ని, సంయమయంను చూసి గర్వపడుతోందని అభినందన్‌కు తెలిపారు.

nirmala

ఇక పాకిస్తాన్‌లో బంధీగా ఉన్నప్పుడు తన అనుభవాల గురించి సీతారామన్‌కు అభినందన్ వివరించినట్లు తెలుస్తోంది. దాదాపు గంటపాటు మంత్రితో పాక్‌లో తన అనుభవాల గురించి అభినందన్ వివరించారు. ఇక అభినందన్ నిర్మలాసీతారామన్‌తో ముచ్చటిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శుక్రవారం రాత్రి వాఘా సరిహద్దులో విడుదల సందర్భంగా నీలం కలర్ బ్లేజర్, తెల్లరంగు షర్టుతో కనిపించిన అభినందన్ ఈ ఫోటోలో మాత్రం హాస్పిటల్‌లో తన ఎయిర్‌ఫోర్స్ యునిఫారం ధరించి ఉన్నట్లు కనిపించాడు.

ఇదిలా ఉంటే కొన్ని నిబంధనల ప్రకారమే అభినందన్‌కు అన్ని రకాల మెడికల్ టెస్టులు నిర్వహిస్తున్నామని అధికారులు చెప్పారు. ఆదివారం వరకు ఈ మెడికల్ టెస్టులు కొనసాగుతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం తను ఎయిర్ ఫోర్స్ సెంట్రల్ మెడికల్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఒక్కసారి వైద్య పరీక్షలు పూర్తయితే ఇక తర్వాత కార్యక్రమాలతో ముందుకెళుతామని చెప్పారు. ఇక తన తల్లిదండ్రులతో పాటు ఉన్నతాధికారులను కూడా అభినందన్ కలిసి తన అనుభవాలను పంచుకున్నాడు.

English summary
Defence Minister Nirmala Sitharaman today visited Wing Commander Abhinandan Varthaman at a hospital in Delhi, where the Indian Air Force pilot had been taken last night for a medical check-up after his arrival in India from Pakistan. Ms Sitharaman told the pilot that the entire nation is proud of his courage and determination.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X