• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

క్లిష్ట సమయంలో సంక్లిష్ట పర్యటన.!విక్ట‌రీ ప‌రేడ్ డే కోసం రాజ్‌నాథ్ సింగ్ కు ఆహ్వానం పంపిన మాస్కో.!

|

మాస్కో/హైదరాబాద్ : కరోనా క్లిష్ట సమయంలో మరింత సంక్లిష్టమైన ఆహ్వానం భారతదేశానికి అందింది. కరోనా కష్ట కాలంలో ఉన్న ప్రపంచ దేశాలు అన్ని రకాల వేడుకలను రద్దు చేసుకున్నాయి. దాదాపు 90 రోజులుగా ప్రపంచంలోని సుమారు 120దేశాలు కరోనా వైరస్ కట్టడిలలో భాగంగా స్వీయ నియంత్రణ పాటిస్తూ లాక్‌డౌన్ ఆంక్షలను అమలు చేస్తున్నాయి. అయిన్పపటికి కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తూనే ఉంది. సరిగ్గా ఇదే సమయంలో రష్యా దేశం ఓ ప్రతిష్టాత్మక వేడుకు నిర్వహించుకునేందుకు సన్నాహాలు చేస్తోంది.

కరోనా కోరలు చాస్తూ విషం చిమ్ముతున్న ప్రస్తుత తరుణంలో ఇలాంటి వేడుకలు ఎందుకనే విమర్శలు వస్తున్నా అనివార్యమైన కార్యక్రమం కబట్టి నిర్వహిచాల్సిందేనన్న పట్టుదలతో రష్యా దేశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ వేడుకల్లో పాలుపంచుకోవాల్సిందిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కు రష్యా ప్రభుత్వం ఆహ్వానం పంపింది.

Defence Minister Rajnath singh to attend victory day parade in moscow,

అంతే కాకుండా ఇదే నెల జూన్ 24 న మాస్కోలోని రెడ్ స్క్వేర్‌లో జరిగే సైనిక కవాతులో భారతదేశం తరుపున కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొనాలని ర‌ష్యా ర‌క్ష‌ణ మంత్రి సెర్గీ షోయ్‌గు ఆహ్వానం పంపారు. ఆ మేరకు రాజ్‌నాథ్‌ సింగ్ రష్యాకు పయనం కానున్నారు. రెండవ ప్రపంచ యుద్ధంలో సాధించిన విజయానికి గుర్తింపుగా నిర్వహించుకునే రష్యా, ప్రతిష్టాత్మకంగా 75వ వార్షికోత్సవ వేడుకలను నిర్వహిస్తోంది. ఈ విక్ట‌రీ డే ప‌రేడ్ వేడుక‌ల్లో భారత్ తరుపున త్రివిధ దళాలకు చెందిన 75 మంది మిలిట‌రీ బృందం హాజరుకానుంది.

హైదరాబాద్ పోలీసులపై కరోనా పంజా.. ముగ్గురు ఉన్నతాధికారులకు..?

ఈ బృందానికి భార‌త‌ సిక్కు ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్‌కు చెందిన మేజ‌ర్ ర్యాంక్ ఆఫీస‌ర్ నాయ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ర‌ష్యాతో పాటు మిత్ర దేశాలు క‌న‌బ‌రిచిన సాహ‌సం, త్యాగాల‌ను స్మ‌రిస్తూ విక్ట‌రీ డే ప‌రేడ్‌ను ఏర్పాటు చేసింది రష్యా ప్రభుత్వం. రెండ‌వ ప్ర‌పంచ యుద్ధంలో సిక్కు రెజిమెంట్ నాలుగు యుద్ధ అవార్డులను సాధించింది. ఐతే కరోనా విలయ తాండవం చేస్తున్న తరుణంలో రష్యా దేశంలో కూడా కరోనా కేసులు ఎక్కువగానే నమోదయ్యాయి. దీంతో వేడుకలకు హాజరయ్యే అంశంలో సంధిగ్దత నెలకొన్నట్టు తెలుస్తోంది.

English summary
On June 24, Russian Defense Minister Sergei Shoygu invited India's Defense Minister Rajnath Singh to participate in a military parade in Moscow's Red Square.To that end, Rajnath Singh is planning to fly to Russia.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more