వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబ్రీ మసీదు కూల్చివేతపై విచారణ: డిఫెన్స్ న్యాయవాదిపై సీబీఐ కోర్టు ఆగ్రహం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేతపై బుధవారం విచారణ చేపట్టిన సీబీఐ ప్రత్యేక కోర్టు.. రెండుసార్లు సమయం ఇచ్చినప్పటికీ డిఫెన్స్ న్యాయవాది రాతపూర్వకమైన వాదనలను కోర్టుకు సమర్పించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణను మరింత ఆలస్యం చేసేందుకే డిఫెన్స్ న్యాయవాది ప్రయత్నిస్తున్నట్లు తాము భావించాలా? అని స్పెషల్ జడ్జీ ఎస్కే యాదవ్ వ్యాఖ్యానించారు.

రాతపూర్వక వాదనలు ఫైల్ చేసేందుకు ఆగస్టు 31 వరకు సమయం ఇవ్వాలని డిఫెన్స్ న్యాయవాది కోరగా.. జడ్జీ యాదవ్ తిరస్కరించారు. గురువారంలోగా సమర్పించాలని స్పష్టం చేశారు. కాగా, కోర్టు ఇంతకుముందు ఆగస్టు 21, ఆగస్టు 24 వరకు రెండుసార్లు సమయం ఇచ్చింది.

 Defence seems bent upon delaying Babri mosque demolition trial: CBI court

ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ సిబిఐ ఇప్పటికే 400 పేజీల లిఖిత వాదనలు దాఖలు చేసింది. ఈ కేసులో తన తీర్పును ప్రకటించడానికి సుప్రీంకోర్టు సెప్టెంబర్ చివరి వరకు గడువుగా నిర్ణయించినందున విచారణను వేగవంతం చేయడానికి కోర్టు ప్రయత్నిస్తోంది.

తీర్పు రాసేటప్పుడు పరిగణించవలసిన పత్రాల వాల్యూమ్‌లను పరిగణలోకి తీసుకోవాలని. అందువల్ల ఇది రాయడానికి చాలా సమయం పడుతుందని, అయితే డిఫెన్స్ న్యాయవాది మళ్లీ మళ్లీ సమయం కోరితే, విచారణను ఆలస్యం చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోందని అభిప్రాయపడింది సీబీఐ కోర్టు.

1992 డిసెంబర్‌లో అయోధ్యలోని 16 వ శతాబ్దపు మసీదు కూల్చివేసిన కేసులో 32 మంది నిందితులు ఉన్నారు. వారిలో మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ, మాజీ యూపీ సీఎం కళ్యాణ్ సింగ్, బీజేపీ నేతలు మురళీ మనోహర్ జోషీ, ఉమా భారతి, వినయ్ కతియార్, సాద్వీ రితాంభరా, సాక్షి మహారాజ్, రామ్ తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ సెక్రటరీ చంపత్ రాయ్ ఉన్నారు.

కాగా, ముగింపు దశలో ఉన్న ఈ కేసు ప్రస్తుతం వాదనల దశలో ఉంది. ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ సిబిఐ తన వాదనలను సమర్పించింది, డిఫెన్స్ న్యాయవాది వారి స్వంత వ్రాతపూర్వక వాదనలను దాఖలు చేయడం ద్వారా ఖండించాల్సి ఉంది. ఇక ఒకసారి వాదనలు పూర్తయితే, కోర్టు తీర్పు ఇవ్వనుంది.

English summary
Defence seems bent upon delaying Babri mosque demolition trial: CBI court
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X