వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యావజ్జీవం: క్షమాభిక్ష పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: క్షమాభిక్ష పిటిషన్ పైన సుప్రీం కోర్టు మంగళవారం కీలక తీర్పు ఇచ్చింది. క్షమాభిక్ష పిటిషన్ పైన నిర్ణయంలో జాప్యం అయితే మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చేందుకు ప్రతిపాదన ఉన్నట్లేనని తెలిపింది. దీంతో నలుగురు వీరప్పన్ అనుచరులు, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ హత్య కేసులో నిందితులు సహా మొత్తం పదిహేను మందికి విధించిన మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చింది. రాజీవ్ గాంధీ హంతకులకు కూడా ఉరిశిక్ష నుండి మినహాయింపు ఇచ్చినట్లుగా సమాచారం.

క్షమాభిక్ష పిటిషన్ల పైన వెలువరించిన కీలక తీర్పు నేపథ్యంలోనే సుప్రీం కోర్టు వారి శిక్షను రద్దు చేసింది. ఏకాంత శిక్ష అనుభవిస్తున్న వారికి మానసిక అస్వస్థత ఉంటే మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చవచ్చునని సుప్రీం వెల్లడించింది.

Supreme Court

మరణ శిక్ష అనుభవిస్తున్న, ఇతర ఖైదీలకు ఏకాంతవాస శిక్ష రాజ్యాంగ విరుద్ధమని తీర్పులో వెల్లడించంది. క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణకు గురైతే ఖైదీ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

మరణశిక్ష ఖైదీల పిటిషన్ తిరస్కరణకు గురైతే పద్నాలు రోజుల్లో శిక్షను అమలు చేయాలని పేర్కొంది. మరణ శిక్ష ఖైదీలకు న్యాయ సాయం అందించాలని సూచించింది.

English summary
The Supreme Court today said a delay in deciding on mercy petitions justifies commuting a convict's death sentence to life.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X