వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నితీశ్ ప్రమాణ స్వీకారం: రాహుల్ ఆలస్యానికి కారణం!

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

పాట్నా: బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ఐదోసారి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని పాట్నాలోని గాంధీ మైదానంలో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి దేశంలోని అతిరథులంతా హాజరయ్యారు. అయితే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎక్కడా కనిపించలేదు.

విమాన ఆలస్యం కారణంగానే ప్రమాణ స్వీకారానికి ఆలస్యంగా హాజరైనట్లు రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా తెలిపారు. "ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ, దానికి సంబంధించిన కారణాల వల్ల గంటకు పైగా ఫ్లైట్ ఆలస్యం అయింది. ఇప్పుడే పాట్నాలో లాండ్ అయ్యాను. గాంధీ మైదాన్‌కు వెళుతున్నా" అని రాహుల్ మూడు గంటల సమయంలో ట్వీట్ చేశారు.

బిహార్‌లో మహాకూటమి విజయం తర్వాత రాహుల్‌లో పెరిగిన ఉత్సాహం అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికల్లో 41 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థులు 27 స్థానాల్లో గెలిచి ఆ పార్టీలో నూతనోత్సాహాన్ని నింపారు. మధ్యాహ్నాం 2 గంటల సమయంలో ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే.

నితీశ్ కుమార్ ప్రమాణస్వీకార మహోత్సవానికి కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీహార్ బీజేపీ లీడర్ సుశీల్ కుమార్ మోడీ, హిమాచల్ ప్రదేశ్ సీఎం వీరభద్ర సింగ్ తదితరులు హాజరయ్యారు. వెంకయ్య నాయుడు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ పక్కనే కూర్చున్నారు.

Delayed flight forces Rahul Gandhi to miss Nitish Kumar's swearing in

రెండు లక్షల మంది ప్రజలు హాజరైన ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. మహాకూటమిలో భాగమైన కాంగ్రెస్ బీహార్ లో 41 స్థానాల్లో పోటీచేసి 27 స్థానాల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే.

English summary
Congress vice-president Rahul Gandhi, whose beleaguered party received a major boost as it won 27 of the 41 seats it contested in Bihar, had to miss the mega swearing-in ceremony of Nitish Kumar at Patna's Gandhi Maidan on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X