వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

march 19, 2020.. నిద్రలేని రాత్రి, నైట్ నో మీల్, స్నానం చేయకుండానే.. 3.30 గం. వరకు మెల్కోని..

|
Google Oneindia TeluguNews

నిర్భయ నలుగురు దోషులు అక్షయ్, ముఖేశ్, పవన్, వినయ్ ఉరిశిక్ష విధించే ఒక్కరోజు ముందు నిద్రలేని రాత్రి గడిపారు. ఉరిశిక్షను తప్పించుకునేందుకు న్యాయ ప్రక్రియలు ముగిసిపోవడం.. ఉరికంబం ఎక్కాల్సి రావడంతో ఆందోళనకు గురయ్యారు. రాత్రి పూట ఆహారం కూడా తీసుకోలేదని తీహార్ జైలు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

తెల్లవారుజామున ఉరి శిక్ష విధించనుండటంతో దోషులు నలుగురు ఆందోళనతో ఉన్నారని జైలు అధికారులు పేర్కొన్నారు. నలుగురు విడి విడిగా గదుల్లో ఏకాంతంగా ఉన్నారని తెలిపారు. అంతకుముందు రోజులాగా కాకుండా.. రాత్రిపూట ఆహారం కూడా తీసుకోలేదని వివరించారు. తమకు కోర్టుల్లో ఊరట లభిస్తుందోనని తెల్లవారుజామున 3.30 గంటల వరకు ఉత్కంఠగా ఎదురుచూశారని తెలిసింది. కానీ పాటియాల కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులో ఊరట లభించకపోవడంతో మిన్నకుండిపోయారని తెలుస్తోంది.

delhi 2012 gang rape case: Convicts Refused Last Meal, Hardly Slept, Didnt Bath

తీహార్ జైలులో ఉన్న సమయంలో పవన్, వినయ్, ముఖేశ్ కూలీ పని చేశారు. జైలులో ఉన్న సమయంలో వారు చేసిన పనికి వేతనం వారి కుటుంబసభ్యులకు అందజేస్తామని పేర్కొన్నారు. అక్షయ్ కుమార్ మాత్రం జైలులో ఎలాంటి పనిచేయలేదు అని.. అతని వస్తువులను మాత్రం కుటుంబసభ్యులకు అందజేస్తామని తెలియజేశారు. మరోవైపు జైలులో ఉండగా వినయ్ శర్మను తలను గోడకేసి కొట్టుకున్న సంగతి తెలిసిందే.

Recommended Video

Good Morning India : 3 Minutes 10 Headlines : Key Points Of YS Jagan, Narendra Modi Meet

నలుగురు నిందితులను ఉరితీసిన తర్వాత.. 30 నిమిషాల పాటు వేలాడతీశారు. తీహార్ జైలు వైద్యుడు నలుగురు నిందితులు చనిపోయారని నిర్ధారించిన తర్వాతే వదిలేశారు. తర్వాత పోస్టుమార్టం కోసం దీన్‌దయాళ్ ఆస్పత్రికి తరలించారు. ఐదుగురు సభ్యుల బృందం పోస్టుమార్టం చేసి.. కుటుంబసభ్యులకు అప్పగించింది.

English summary
four convicts in the Nirbhaya case spent a restless night at Delhi's Tihar Jail before their hanging before dawn today
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X