• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

december 16, 2012న ఏం జరిగింది..? నిర్భయపై కామెంట్లు, స్నేహితుడిపై రాడ్డుతో దాడి, గ్యాంగ్ రేప్

|

నిర్భయ దోషులకు కొన్ని గంటల ముందు తీహార్ జైలు అధికారులు ఉరితీశారు. ఏడేళ్ల క్రితం పారామెడికల్ విద్యార్థినిపై గ్యాంగ్ రేపి, చనిపోయేందుకు కారణమైన వారు ఉరికొయ్యకు వేలాడారు. అసలు ఇంతకు 2012 డిసెంబర్ 16వ తేదీన ఏం జరిగింది..? పారామెడికల్ విద్యార్థిని మానవ మృగాళ్ల కబంధహస్తాల్లో ఎలా చిక్కుకొంది. ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది. వన్ ఇండియా ప్రత్యేక కథనం.

 కరాళ రాత్రి..

కరాళ రాత్రి..

2012 డిసెంబర్ 16: తన స్నేహితుడితో కలిసి నిర్భయ సినిమాకు వెళ్లి ఇంటికి తిరిగొస్తున్నారు. ఓ ప్రైవేట్ బస్సులో వారు ఎక్కారు. అయితే అందులో ఆరుగురు మాత్రమే ఉన్నారు. వారు వెళ్లాల్సిన మార్గంలో కాక మరో రూట్‌లో బస్సు వెళ్లడంతో అనుమానం వచ్చి ప్రశ్నించారు. దీంతో యువకులు.. నిర్భయ స్నేహితుడిపై రాడ్డుతో దాడి చేశారు. దీంతో అతను సృహ తప్పిపడిపోయాడు. నిర్భయను కూడా రాడ్డుతో దాడి చేశాడు. బస్సులోనే ఒకరి తర్వాత ఒకరు ఆరుగురు లైంగికదాడి చేశారు. సున్నితమైన ప్రాంతాల్లో రాడ్డు కూడా దింపడంతో.. నిర్భయ తీవ్ర అస్వస్థతకు గురైంది. లైంగికదాడి చేసిన తర్వాత నగ్నంగా యువతి సహా ఆమె స్నేహితుడిని బస్సు నుంచి కిందకి పడేశారు. వారిని చూసిన టోల్ ప్లాజా సిబ్బంది స్థానికుల సాయంతో సఫ్తార్ గంజ్ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి మరింత విషమించడంతో.. సింగపూర్‌లోని మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రికి తరలించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. 13 రోజుల తర్వాత డిసెంబర్ 29వ తేదీన నిర్భయ చనిపోయారు.

ఏం జరిగిందంటే..

ఏం జరిగిందంటే..

తన స్నేహితుడితో కలిసి బయటకొచ్చిన నిర్భయ.. దక్షిణ డిల్లీలో గల సాకెట్ థియేటర్‌లో లైఫ్ ఆఫ్ పై సినిమా చూశారు. రాత్రి 9 గంటలకు వారు మున్నికా బస్టాండ్ వద్దకు ఆటో రిక్షాలో వచ్చారు. అక్కడ ఇంటికి వెళ్లేందుకు బస్సుల కోసం ఎదురుచూశారు. అయితే ఒక్క బస్సు కూడా లేకపోవడంతో.. చివరికి ప్రైవేట్ బస్సులో ఎక్కారు. నలుగురు డ్రైవర్ క్యాబిన్‌లో ఉండగా.. ఇద్దరు క్యాబిన్ వెనక కూర్చొన్నారు. నిర్భయ, ఆమె స్నేహితుడు బస్సులో రెండో వరసలో కూర్చొని.. తమ గమ్య స్థానం కోసం రూ.20 టికెట్ ఇచ్చారు.

 నిర్భయపై కామెంట్లు..

నిర్భయపై కామెంట్లు..

బస్సు ఎయిర్‌పోర్టు సమీపంలో గల ఫ్లై ఓవర్‌కు చేరుకునే సమయంలో ముగ్గురు క్యాబిన్ నుంచి నిర్భయ వద్దకొచ్చారు. అందులో ఇద్దరు నిర్భయను దూషిస్తూ.. సాయంత్రం పూట ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. నిర్భయను దూషించడంతో ఆమె స్నేహితుడు గొడవ పడ్డాడు. దీంతో క్యాబిన్‌లో ఉన్న మరో ఇద్దరు వచ్చారు. అతనితో గొడవ పడి... రాడ్డుతో దాడి చేశారు. యువకుడిని కొట్టడంతో నిర్భయ వచ్చి.. కాపాడేందుకు ప్రయత్నం చేయగా.. ఆమెను నెట్టివేశారు. బస్సులో కొందరు యువకుడిని కొడుతుండగా.. మరికొందరు యువతిపై లైంగికదాడికి తెగబడ్డారు. సున్నితమైన ప్రాంతాలో రాడ్డు దింపి పైశాచిక ఆనందం పొందారు.

  Twilight News : 3 Minutes 10 Headlines | Corona Virus |AP Capital Issue |CAA |Shaheen Bagh Issue
  బస్సుల్లోంచి విసిరేసి..

  బస్సుల్లోంచి విసిరేసి..


  లైంగికదాడి తర్వాత బాధితురాలు, ఆమె స్నేహితుడి వద్ద నుంచి నగదు కూడా దోచుకున్నారు. తర్వాత వారిద్దరిని కదులుతొన్న బస్సు నుంచి విసిరేశారు. జాతీయ రహదారి 8 వద్ద గల మహిపాల్‌పూర్ ప్లై ఓవర్ వద్ద నిర్భయ నగ్నంగా, ఆమె స్నేహితుడు పడి ఉన్నారు. అక్కడే తచ్చాడుతున్న వారు పోలీసులకు సమాచారం అందజేశారు. నిర్భయంపై వస్త్రం కప్పి.. వెంటనే సప్తార్ జంగ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమె చికిత్స తీసుకున్నారు. మెరుగైన వైద్యం కోసం సింగపూర్ తరలించారు. కానీ 13 రోజుల తర్వాత నిర్భయ ఆసువులు బాసారు.

  English summary
  Four men were hanged early on Friday for gang-raping and beating a 23-year-old woman along with her friend in a moving private bus on December 16, 2012.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X