వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలివే.. చివరి నిమిషంలో అమిత్ షా ట్వీట్..

|
Google Oneindia TeluguNews

Recommended Video

Good Morning India : 3 Minutes 10 Headlines | Actor Vijay It Raids | Astronaut Christina Koch

దేశమంతా ఆసక్తిగా గమనిస్తోన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార పర్వం గురువారంతో ముగిసింది. చివరిరోజు అన్ని పార్టీల ముఖ్యనేతలు, కార్యకర్తలు ఢిల్లీ వీధులను హోరెత్తించారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకుగానూ శనివారం(8న) పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం 13,750 పోలింగ్ బూత్ లను ఎన్నికల సంఘం సిద్ధం చేస్తోంది. దాదాపు లక్షమంది పోలింగ్ సిబ్బందిని ఆయా ప్రాంతాల్లో విధులు నిర్వహించనున్నారు. భద్రత కోసం 190 కంపెనీల పారామిలటరీ బలగాలు, 3800 మంది ఢిల్లీ పోలీసులు, 19వేల మంది హోం గార్డులను మోహరింపజేశారు. పోలింగ్ డే కోసం మెట్రో అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అధికార ఆమ్ ఆద్మ పార్టీ(ఆప్)తో బీజేపీ హోరాహోరీగా తలపడుతున్న నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.

బీజేపీకి 45కుపైగా సీట్లు

ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తలపడుతున్న బీజేపీ.. తొలిసారి మెజార్టీపై ప్రకటన చేయడం విశేషం. ఢిల్లీలోని 70 స్థానాల్లో బీజేపీకి 45 సీట్లకు తగ్గకుండా మెజార్టీ సాధిస్తుందని సాక్షాత్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ప్రచారం ముగియడానికి కొద్ది నిమిషాల ముందు ఈమేరకు ఆయనో ట్వీట్ చేశారు. ఎన్నికల సందర్భంలో ఢిల్లీ ప్రజలతో కలవడం సంతోషంగా ఉందని, తప్పుడు వాగ్దానాలతో గద్దెనెక్కిన కేజ్రీవాల్ తీరుతో జనం విసిగిపోయారని, ఇప్పుడు ఢిల్లీ అభివృద్ధిని మాత్రమే కోరుకుంటోందని, 45 సీట్లకు తక్కువ కాకుండా బీజేపీ విజయం సాధిస్తుందని, ఫిబ్రవరి 11న తాను చెప్పింది జరుగుతుందని అమిత్ షా రాసుకొచ్చారు.

అమిత్ షా ర్యాలీలో ‘గోలీమారో..’


కేంద్ర మంత్రి అమిత్ షా గురువారం సాయంత్రం హరి నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి తజిందర్ పాల్ సింగ్ బగ్గా తరఫున ప్రచారం నిర్వహించారు. వేలాది మంది కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే అమిత్ షా కు సమీపంలోనే కొందరు కార్యకర్తలు వివాదాస్పద ‘‘దేశ్ కే గద్దారోంకో.. గోలీమారో సాలోంకో''నినాదాలు చేయడం కలకలం రేపింది. ఈ నినాదం చేసిన కారణంగానే కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పై ఈసీ ప్రచార నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

సత్యమేవ జయతే..

సత్యమేవ జయతే..


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సత్యమే గెలుస్తుందని, మంచి పనులు చేసినవారినే ఓటర్లు ఆశీర్వదిస్తారని, ఈసారి కూడా ఆప్ ప్రభుత్వం భారీ మెజార్టీతో గెలుస్తుందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తల్లాగా విద్వేషాల జోలికి పోకుండా.. ఆప్ కార్యకర్తలందరూ శాంతియుతంగా, ఆదర్శవంతంగా ప్రచారం నిర్వహించారని ఆయన తెలిపారు. ప్రచారం ముగిసిన తర్వాత ఓటర్లకు బీజేపీ మద్యం పంచుతోందంటూ ఆప్ నేతలు వీడియోలు విడుదల చేశారు.

యూపీ సీఎం యోగికి ఈసీ నోటీసులు

యూపీ సీఎం యోగికి ఈసీ నోటీసులు

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. తీహార్ జైలులో టెర్రరిస్టులకు బిర్యానీ తినిపించారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ కు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీచేసింది. శుక్రవారం సాయంత్రం 5 గంటల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

సర్‌ప్రైజ్ చేస్తామన్న కాంగ్రెస్

సర్‌ప్రైజ్ చేస్తామన్న కాంగ్రెస్

బీజేపీ, ఆప్ తో పోల్చుకుంటే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వెనుకబడిపోయిందన్న వాదనను ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఖండించారు. ఫిబ్రవరి 8న హస్తం గుర్తుకు సైలెంట్ ఓటింగ్ జరుగుతుందని, 11నాటి ఫలితాలతో కాంగ్రెస్ అందరినీ సర్ ప్రైజ్ చేస్తుందని ఆయన చెప్పారు.

English summary
poll campaign for Delhi Assembly Elections ends by thursday evening. aap, congress, bjp expressed their confidence for february 8th polling. Union Home Minister Amit Shah hopes bjp will win over 45 seats in total 70
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X