వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు: మళ్లీ ఆప్‌దే హవా.. కేజ్రీవాల్‌కే ఎగ్జిట్ పోల్స్‌ పట్టం

|
Google Oneindia TeluguNews

దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీకి పోలింగ్ జరుగుతోంది. ఉదయం 8 గంటల నుంచి ఓటింగ్ మొదలైంది. ల్లీ అసెంబ్లీకి 70 స్థానాలు ఉన్నాయి. 2015లో ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. మెజార్టీ స్థానాలను కైవసం చేసుకొని అధికారం చేపట్టింది. ఈ సారి కూడా అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్‌కే ప్రజలు పట్టం కడతారని సర్వే సంస్థలు అంచనా వేశాయి.

Delhi Assembly election LIVE updates: Will Aravind Kejriwal come back to power

గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీ హవా కనిపించింది. ఏడు లోక్‌సభ స్థానాలు గెలిచి సత్తా చాటింది. కానీ ఏడాదిలోపే పరిస్థితి మారిపోయినట్టు అనిపించింది. ఢిల్లీ ప్రజల గాలి మళ్లీ చీపురు పార్టీకే మళ్లినట్టు కనిపిస్తోంది. శనివారం సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. క్యూ లైన్‌లో ఉన్నవారికి ఓటేసేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తోంది. ఈ నెల 11 మంగళవారం రోజున ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడుతారు. మధ్యాహ్నం వరకు ట్రెండ్ తెలిసిపోతోంది. ఢిల్లీని ఏలే రాజు ఎవరో తేలిపోతోంది.

Newest First Oldest First
8:06 PM, 8 Feb

ఇండియా టుడే ఫైనల్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు

ఇండియా టుడే ఫైనల్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు: ఆప్ 59-68 సీట్లు, బీజేపీ 2-11 సీట్లు
7:46 PM, 8 Feb

దక్షిణ ఢిల్లీలో 10 సీట్లు గాను..

దక్షిణ ఢిల్లీలో 10 సీట్లు గాను.. ఆప్ 9 నుంచి 10 సీట్లు, బీజేపీ 0-1 సీట్లు, కాంగ్రెస్ ఖాతా ఓపెన్ చేయదని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్‌లో స్పష్టమైంది.
7:44 PM, 8 Feb

దక్షిణ ఢిల్లీలో కూడా ఆప్‌దే హవా

ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్: పశ్చిమ ఢిల్లీ, నైరుతి ఢిల్లీ, ఈశాన్య ఢిల్లీ, చాందినీ చౌక్‌, తూర్పు ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ (60 సీట్లు): ఆప్‌కు 50 నుంచి 58, బీజేపీకి 2 నుంచి 10 సీట్లు, కాంగ్రెస్ 0
7:35 PM, 8 Feb

రాజధాని ఢిల్లీలోని ఐదు ప్రాంతాల్లో ఆప్‌దే హవా

ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్: పశ్చిమ ఢిల్లీ, నైరుతి ఢిల్లీ, ఈశాన్య ఢిల్లీ, చాందినీ చౌక్‌, తూర్పు ఢిల్లీ (50 సీట్లు): ఆప్‌కు 41 నుంచి 48, బీజేపీకి 2 నుంచి 9 సీట్లు, కాంగ్రెస్ 0
7:20 PM, 8 Feb

ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్

ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్: పశ్చిమ ఢిల్లీ, నైరుతి ఢిల్లీ, ఈశాన్య ఢిల్లీ, చాందినీ చౌక్‌ (40 సీట్లు): ఆప్‌కు 32 నుంచి 38, బీజేపీకి 2 నుంచి 8 సీట్లు, కాంగ్రెస్ 0
7:17 PM, 8 Feb

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2020

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2020: ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాల్లో కాంగ్రెస్‌కు మొండిచేయి
7:17 PM, 8 Feb

పుంజుకోనున్న బీజేపీ

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2020: పుంజుకోనున్న బీజేపీ.. గత అసెంబ్లీలో 3 స్థానాలకే పరిమితమైన బీజేపీ
7:02 PM, 8 Feb

ఇండియా న్యూస్ ఎగ్జిట్ పోల్స్

ఇండియా న్యూస్ ఎగ్జిట్ పోల్స్: ఆప్ 53-57 సీట్లు, బీజేపీ 11-17 సీట్లు, కాంగ్రెస్ 2
6:58 PM, 8 Feb

సుదర్శన్ న్యూస్ ఎగ్జిట్ పోల్స్

సుదర్శన్ న్యూస్ ఎగ్జిట్ పోల్స్: ఆప్ 40-45 సీట్లు, బీజేపీకి 24-28 సీట్లు, కాంగ్రెస్ 2-3 సీట్లు
6:52 PM, 8 Feb

ఉత్తర ఢిల్లీలో ఎగ్జిట్ పోల్స్

ఉత్తర ఢిల్లీలో ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్: ఆప్ 7-9, బీజేపీకి 1-3 సీట్లు
6:50 PM, 8 Feb

ఇండియా టీవీ ఎగ్జిట్ పోల్స్

ఇండియా టీవీ ఎగ్జిట్ పోల్స్: ఆప్ 44, బీజేపీ 26, కాంగ్రెస్ 0
6:47 PM, 8 Feb

రిపబ్లిక్ టీవీ-జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్

రిపబ్లిక్ టీవీ-జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు: ఆమ్ ఆద్మీ పార్టీ: 48-61 బీజీపీ: 9-21 కాంగ్రెస్: 1 ఇతరులు: 0
6:45 PM, 8 Feb

న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్

న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్: ఆప్‌కు 44 సీట్లు, బీజేపీకి 26 సీట్లు
6:44 PM, 8 Feb

టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్

టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్.. ఆప్ 44 సీట్లు, బీజేపీ 26 సీట్లు
6:43 PM, 8 Feb

న్యూస్ ఎక్స్ ఎగ్జిట్ పోల్స్:

న్యూస్ ఎక్స్ ఎగ్జిట్ పోల్స్: ఆప్‌కు 53 నుంచి 57 సీట్లు, బీజేపీకి 11 నుంచి 17 సీట్లు, కాంగ్రెస్‌కు 0-2 సీట్లు
6:41 PM, 8 Feb

రిపబ్లిక్ ఎగ్జిట్ పోల్స్

రిపబ్లిక్ ఎగ్జిట్ పోల్స్: ఆప్‌కు 48-61 స్థానాలు, బీజేపీకి 9 నుంచి 21 సీట్లు వస్తాయని వెల్లడి
6:36 PM, 8 Feb

న్యూస్ ఎక్స్-నేత ఎగ్జిట్ పోల్స్

న్యూస్ ఎక్స్-నేత ఎగ్జిట్ పోల్స్: ఆమ్ ఆద్మీ 53-57 సీట్లు, బీజేపీకి 11-17 సీట్లు, కాంగ్రెస్ 0 నుంచి 2 సీట్లు వచ్చే అవకాశం
6:34 PM, 8 Feb

ఇండియా టుడే సర్వే

పశ్చిమ ఢిల్లీ (10 సీట్లు) లో ఆమ్ ఆద్మీ పార్టీకి 57 శాతం ఓట్లు, బీజేపీ 35 శాతం ఓట్లు , కాంగ్రెస్ 4 శాతం ఓట్లు వచ్చే అవకాశం.. ఇండియా టుడే సర్వే
6:31 PM, 8 Feb

పశ్చిమ ఢిల్లీలో

పశ్చిమ ఢిల్లీ (10 సీట్లు) లో ఆమ్ ఆద్మీ పార్టీకి 9-10, బీజేపీ 0-1, కాంగ్రెస్ 0
6:23 PM, 8 Feb

6 గంటల వరకు 54.67 శాతం

సాయంత్రం 6 గంటల వరకు 54.67 శాతం పోలింగ్ నమోదు
6:22 PM, 8 Feb

ముగిసిన ఢిల్లీ ఎన్నికల పోలింగ్

ముగిసిన ఢిల్లీ ఎన్నికల పోలింగ్.. కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
6:13 PM, 8 Feb

2015లో ఓవరాల్‌గా

2015లో ఓవరాల్‌గా 67 శాతం పోలింగ్ నమోదు
6:13 PM, 8 Feb

సాయంత్రం 5 గంటల వరకు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకు 52.91 శాతం పోలింగ్ నమోదు
5:43 PM, 8 Feb

షహీన్‌బాగ్‌లోని స్కూల్ వద్ద ఓటేసేందుకు బారులుతీరిన జనం
5:43 PM, 8 Feb

సాయంత్రం 5 గంటల వరకు 44.52 శాతం పోలింగ్ నమోదు
4:58 PM, 8 Feb

డబ్బులు ఇవ్వలేదు..

ప్రజలకు డబ్బులు పంచుతున్నారనే ఆప్ ఆరోపణలపై కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ స్పందిస్తూ.. తనకు తెలిసిన దుకాణదారుడి వద్దకెళ్లి ఆహార వస్తువు కొనుగోలు చేశానని వివరించారు. డబ్బులు ఇవ్వలేదని, దీనిని కూడా కొందరు బీహరీ వర్సెస్ నాన్ బీహరీగా మలిచే అవకాశం ఉందన్నారు.
4:30 PM, 8 Feb

42 శాతం ఓటింగ్ నమోదు.

4 గంటల వరకు 42 శాతం ఓటింగ్ నమోదు.. ఈసీ అధికార వెబ్‌సైట్‌ ద్వారా వెల్లడి
4:25 PM, 8 Feb

నేషనలిస్టు పార్టీకి ఓటు వేయాలి

కిక్కిరిసిన క్యూలలో నిలబడి ఆప్‌కు ఓటు వేయాలని షహీన్ బాగ్ ప్రజలు నినాదాలు ఇస్తే.. ఢిల్లీలోని మిగితా ప్రజలు బయటకు వచ్చి నేషనలిస్టు పార్టీకి ఓటు వేయాలి.. ఎంపీ పర్వేశ్ వర్మ
4:16 PM, 8 Feb

ఢిల్లీలోని వివిధ జిల్లాలో నమోదైన పోలింగ్

ఢిల్లీలోని వివిధ జిల్లాలో నమోదైన పోలింగ్ ఇలా ఉంది.. ఈశాన్య ఢిల్లీలో 50.75% షాదారాలో 48.41% ఉత్తర ఢిల్లీలో 46.69% తూర్పు ఢిల్లీలో 46.46% వాయవ్య ఢిల్లీలో 46.30% ఆగ్నేయ ఢిల్లీలో 44.11% దక్షిణ ఢిల్లీలో 44.00% నైరుతి ఢిల్లీలో 43.20% పశ్చిమ ఢిల్లీలో 43.62% సెంట్రల్ ఢిల్లీలో 41.76% న్యూఢిల్లీలో 41.29%
3:56 PM, 8 Feb

తొమ్మిది నెలల బిడ్డను ఒడిలో పెట్టుకొని ఓటేసిన భరత నాట్యం డ్యాన్సర్ అరణ్యాని భార్గవ్

క్యూలో నిలబడి తొమ్మిది నెలల పసిపాపను ఒడిలో పెట్టుకొని ఓటేసిన భరత నాట్యం డ్యాన్సర్ అరణ్యాని భార్గవ్..
READ MORE

English summary
few hours after delhi assembly election poll will be start.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X