వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేడే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. కౌంటింగ్‌పై ఇవే కీలక పాయింట్స్..

|
Google Oneindia TeluguNews

దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని మొత్తం 10 జిల్లాల్లో 21 కౌటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.తూర్పు ఢిల్లీలోని సీడబ్ల్యూజీ స్టోర్ట్స్ కాంప్లెక్స్, వెస్ట్ ఢిల్లీలోని ఎన్ఎస్ఐటీ ద్వారకా,ఆగ్నేయ ఢిల్లీలోని మీరాభాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ,జీబీ పంత్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ,నార్త్ ఢిల్లీలోని రాజీవ్ గాంధీ స్టేడియం,సెంట్రల్ ఢిల్లీలోని సీవీ రామన్ ఐఐటీ ధీర్‌పూర్ సహా తదితర చోట్ల కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కోసం మొత్తం 33 మంది పరిశీలకులను నియమించారు.

మొత్తం 13,780 పోలింగ్ బూత్‌లలో ఓటింగ్ నిర్వహించగా.. వీటిల్లో 3,843 బూత్‌లను సమస్యాత్మకంగా గుర్తించారు. సీఏఏ నిరసనల నేపథ్యంలో షాహీన్‌బాగ్‌లోని ఐదు పోలింగ్ బూత్‌లను సమస్యాత్మక బూత్‌ల జాబితాలో చేర్చారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్ వద్ద గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. ఈవీఎంలు ఫూల్‌ప్రూఫ్ అని ట్యాంపరింగ్ చేసే అవకాశం లేదని ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి రణబీర్ సింగ్ తెలిపారు.

delhi assembly election results 2020 security arrangements put in place

కాగా,ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 672 మంది అభ్యర్థులు బరిలో నిలవగా వీరిలో 593 మంది పురుష అభ్యర్థులు,79మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఇక ఓటర్ల విషయానికొస్తే.. 1.47కోట్ల మంది ఓటర్లు ఢిల్లీలో ఉన్నారు. వీరిలో 18-19 సంవత్సరాల మధ్య వయస్కులు 2,32,815మంది ఉన్నారు. మహిళా ఓటర్లు 66,80,277 కాగా.. పురుష ఓటర్లు 81,05,236 మంది ఉన్నారు. సర్వీస్ ఓటర్స్ 11,608 మంది,థర్డ్ జెండర్ ఓటర్స్ 869 మంది,సీనియర్ సిటిజెన్స్(80ఏళ్లకు పైబడి) 2,04,830 మంది ఉన్నారు.

ఇక పోలింగ్ ముగిసిన తర్వాత ఈసీ పోలింగ్ శాతాన్ని వెల్లడించకపోవడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. మరుసటిరోజు ఆ వివరాలను వెల్లడించిన ఈసీ.. 62.59శాతం పోలింగ్ నమోదైనట్టు తెలిపింది. 2015లో నమోదైన పోలింగ్ కంటే ఇది 5శాతం తక్కువ. తాజా ఎన్నికలు ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీకి,బీజేపీకి మధ్య జరిగాయి. మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో ఆప్ ఉంటే.. 22 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకోవాలనే ఆరాటంలో బీజేపీ ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పీఠం ఎవరిని వరిస్తుందనేది ఉత్కంఠను రేపుతోంది.

Newest First Oldest First
7:57 AM, 12 Feb

పట్టాభిషేకం

ఈ నెల 14 లేదా 16వ తేదీల్లో ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం
7:47 AM, 12 Feb

కాంగ్రెస్ పార్టీకి 67 చోట్ల డిపాజిట్ గల్లంతు
7:47 AM, 12 Feb

ఢిల్లీలో ఆప్ 62 స్థానాలతో జయకేతనం
7:35 AM, 12 Feb

కాల్పుల కలకలం

మంగళవారం సాయంత్రం ఆలయానికి వెళ్లి వస్తోండగా ఆప్ ఎమ్మెల్యే నరేశ్ యాదవ్ కాన్వాయ్‌పై కాల్పులు
7:33 AM, 12 Feb

దర్యాప్తు షురూ..

ఆప్ ఎమ్మెల్యే నరేశ్ యాదవ్ కాన్వాయ్ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు

English summary
Tight security arrangements have been put in place at various centres across the national capital where the counting of votes polled in the high-stakes February 8 Delhi Assembly elections will take place on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X