వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల: ఫిబ్రవరి 8 పోలింగ్.. ఫిబ్రవరి 11న ఫలితాలు

|
Google Oneindia TeluguNews

కొత్త సంవత్సరంలో మరో ఎన్నికల సమరానికి రంగం సిద్ధమైంది. ఢిల్లీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా ప్రకటించారు. ఇప్పటికే ఢిల్లీలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం జార్ఖండ్ ఎన్నికలు ముగిశాయి. ఆ తర్వాతే ఢిల్లీ రాష్ట్రానికి ఎన్నికలు జరుగుతుండటం విశేషం. ఢిల్లీ అసెంబ్లీకి మొత్తం 70 స్థానాలు న్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 22తో ఢిల్లీ అసెంబ్లీ గడువు ముగుస్తుంది. ఇప్పటికే ఢిల్లీలో ప్రధాన పార్టీలు తమ ప్రచారంను ప్రారంభించాయి. ఇక ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఇప్పటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది.జనవరి 14న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందని... జనవరి 21వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయొచ్చని సీఈఓ తెలిపారు.నామినేషన్ల పరిశీలనజనవరి 22న జరుగుతుంది. 24 జనవరిన నామినేషన్ ఉపసంహరించుకునేందుకు చివరి తేదీ. ఇక ఢిల్లీ ఎన్నికలు ఒకే దశలో జరుగుతాయని చెప్పారు. పోలింగ్ ఫిబ్రవరి 8వ తేదీన జరుగుతుంది. కౌంటింగ్ 11 ఫిబ్రవరి జరుగుతుంది.

ఢిల్లీ ఎన్నికలకు 90వేల మంది సిబ్బందిని వినియోగిస్తున్నట్లు సీఈఓ సునీల్ అరోరా తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాలు గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఉండేలా చర్యలు తీసుకున్నట్లు సునీల్ అరోరా తెలిపారు. దివ్యాంగులకు పిక్‌ అండ్ డ్రాప్ సౌకర్యం కల్పిస్తున్నట్లు సునీల్ అరోరా చెప్పారు. ఈవీఎంలు వీవీప్యాట్లు సరిపడేలా ఉండేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇప్పటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో చట్టవ్యతిరేకమైన పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవని సునీల్ అరోరా హెచ్చరించారు.

Delhi Assembly elections schedule anounced by EC, Feb 8th polling, Results on 11th

2015లో ఢిల్లీకి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారిక పార్టీ ఆప్ 67 స్థానాలు దక్కించుకోగా.. బీజేపీ 3 స్థానాలతో సరిపెట్టుకుంది. తిరిగి అధికారాన్ని దక్కించుకోవాలని కేజ్రీవాల్ పార్టీ భావిస్తుండగా... బీజేపీ కాంగ్రెస్‌లు కూడా ఓటర్లను ఆకట్టుకునేందుకు తాయిలాలు ప్రకటిస్తున్నాయి.

English summary
Chief Election Officer Sunil Arora had anounced the Delhi Assembly election schedule
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X