వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ పోలీస్ బాస్ వద్దని అసెంబ్లీ తీర్మానం -రాకేశ్ ఆస్థానా నియామకంపై ఢిల్లీ ప్రభుత్వం గరంగరం -దేశంలో తొలిసారి

|
Google Oneindia TeluguNews

అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీలో పోలీస్ బాస్ నియామకం వివాదాస్పదమైంది. దేశ చరిత్రలో తొలిసారి ఒక ఐపీఎస్ అధికారి నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఒక రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. విపక్ష నేతలు, ప్రముఖులపై కేంద్ర ప్రభుత్వమే నిఘాకు పాల్పడుతోందనే ఆరోపణలు, 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఢీకొట్టేలా ఢిల్లీ కేంద్రంగా విపక్షాలు కీలక యత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఈ నియామకం రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది..

జగన్ బెయిల్ రద్దు: సాయిరెడ్డికి దేహశుద్ధి -కొట్టింది ఎవరో తెలుసా? -ఇంకొద్ది గంటల్లోనే: ఎంపీ రఘురామ జగన్ బెయిల్ రద్దు: సాయిరెడ్డికి దేహశుద్ధి -కొట్టింది ఎవరో తెలుసా? -ఇంకొద్ది గంటల్లోనే: ఎంపీ రఘురామ

ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా రాకేశ్ ఆస్థానాను నియమించడాన్ని కేజ్రీవాల్ సర్కారు వ్యతిరేకిస్తున్నది. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ అసెంబ్లీలో గురువారం ఓ తీర్మానాన్ని ఆమోదించారు. ప్రధాని మోదీకి అత్యంత ఆప్తుడు, గుజరాత్ కేడర్ కు చెందిన రాకేశ్ ఆస్థానాను.. ఆమ్ ఆద్మీ పార్టీకి భయోత్పాతం కలిగించేందుకే ఢిల్లీపై ప్రయోగిస్తున్నారని కేజ్రీవాల్ సర్కారు ఆందోళన వ్యక్తం చేసింది.

Delhi assembly passes resolution against Rakesh Asthana appointment as police commissioner

రాకేశ్ ఆస్థానాను వెనక్కి పంపాలనే తీర్మానాన్ని ఆప్ ఎమ్మెల్యే సంజీవ్ ఝా ప్రతిపాదించగా, ఢిల్లీ రాష్ట్ర హోం మంత్రి సత్యేంద్ర జైన్ సహా ఆరుగురు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు దీనిపై మాట్లాడుతూ ఆస్థానాపై విమర్శలు గుప్పించారు. బీజేపీ ఎమ్మెల్యే రామ్‌వీర్ సింగ్ బిధూరీ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు.

పెగాసస్ నిఘా కుట్ర: ఇజ్రాయెల్‌లో హైడ్రామా -టెక్ సంస్థ ఎన్ఎస్ఓ ఆఫీసుల్లో తనిఖీలు -భారత్ ఒత్తిడితో!పెగాసస్ నిఘా కుట్ర: ఇజ్రాయెల్‌లో హైడ్రామా -టెక్ సంస్థ ఎన్ఎస్ఓ ఆఫీసుల్లో తనిఖీలు -భారత్ ఒత్తిడితో!

రాకేశ్ ఆస్థానా నియామకం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఢిల్లీ ప్రభుత్వం.. ఆయనకు బదులుగా వేరొక అధికారిని నియమించేందుకు తాజాగా ప్రక్రియను ప్రారంభించాలని తీర్మానంలో పేర్కొంది. సాధారణంగా రాష్ట్రాలకు డీజీపీలు పోలీస్ బాస్ లుగా ఉంటారని, ఢిల్లీకి మాత్రం కమిషనర్ ఉంటారన్న సుప్రీంకోర్టు.. పదవీ విరమణకు ముందు కనీసం ఆరు నెలల సర్వీస్ ఉన్నవారిని మాత్రమే డీజీపీగా లేదా ఢిల్లీ కమిషనర్ గా నియమించాలన్న సుప్రీం తీర్పును కేంద్రం ఉల్లంఘించిందని ఆప్ సర్కారు పేర్కొంది.

English summary
Delhi assembly passed a resolution against the appointment of Rakesh Asthana as the Delhi Police commissioner and asked the Union ministry of home affairs on Thursday to reverse the decision. The ministry of home affairs controls of police in the Union territory of Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X