వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు: కేజ్రీవాల్‌పై పోటీ చేసేది ఈయనే.. అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేసిన బీజే

|
Google Oneindia TeluguNews

Recommended Video

Delhi Assembly Elections : BJP's Candidate Against Arvind Kejriwal || Who Is Sunil Yadav ?

ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల హీట్ పెరుగుతోంది. పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో ఆయా పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేశాయి. మొత్తం 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి అభ్యర్థుల ఖరారు దాదాపు పూర్తయ్యింది. కొద్ది రోజుల క్రితం 57 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను బీజేపీ విడుదల చేసింది. అయితే అరవింద్ కేజ్రీవాల్‌పై ఎవరు పోటీ చేస్తారో అనేది మాత్రం స్పష్టం చేయలేదు. ఇక మంగళవారం ఉదయం 1గంట తర్వాత మరో జాబితాను విడుదల చేసింది బీజేపీ.

ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఫైనల్ జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఈ జాబితాలో సునీల్ యాదవ్‌కు చోటు లభించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై సునీల్ యాదవ్ పోటీ చేయనున్నారు. బీజేపీ ఢిల్లీ యువమోర్చా అధ్యక్షుడిగా సునీల్ యాదవ్ వ్యవహరిస్తున్నారు. వృత్తిరీత్యా ఆయన ఓ అడ్వకేట్. జిల్లా యువమోర్చా అధ్యక్షుడి స్థాయి నుంచి బీజేపీ ఢిల్లీ యువమోర్చా ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగారు. యువతను ఆకట్టుకుంటారన్న విశ్వాసం ఉంచిన హైకమాండ్ సునీల్ యాదవ్‌ను కేజ్రీవాల్‌పై పోటీకి నిలిపింది. ఇక మరో 10 పేర్లల్లో తజీందర్ బగ్గా కూడా ఉన్నారు.

 Delhi Assembly polls:BJP releases final list, Sunil Yadav pitted against Kejriwal

తొలి జాబితాలో తజీందర్ బగ్గాకు చోటు లభించకపోవడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురయ్యాడు. అయితే మంగళవారం విడుదల చేసిన జాబితాలో తజీందర్‌ బగ్గాకు చోటు లభించింది. ఆయన్న హరినగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. అయితే తిలక్ నగర్ నుంచి పోటీచేసేందుకు తజీందర్ బగ్గా ఆసక్తి చూపుతున్నారు. అయితే ఆ స్థానం మరొకరికి పార్టీ అధిష్టానం కేటాయించింది. తజీందర్ బగ్గా పార్టీ ప్రతినిధిగా ఉన్నారు. భగత్ సింగ్ క్రాంతి సేన అనే సంస్థను బగ్గా స్థాపించారు. కశ్మీర్‌ పై అణుచిత వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు సీనియర్ లాయర్, ఆప్ నేత ప్రశాంత్ భూషణ్‌పై దాడి చేసి బగ్గా వార్తల్లో నిలిచారు.

మొత్తానికి బీజేపీ ఢిల్లీ ఎన్నికల్లో 67 మందిని పోటీకి దింపనుండగా మరో 3 సీట్లు మిత్రపక్షం అయిన ఎల్‌జేపీ, జేడీయూ పార్టీలకు కేటాయించింది. సంగం విహార్, బురారీ సీట్లను జేడీయూకు కేటాయించగా సీమాపురి సీటును ఎల్‌జేపీకి కేటాయించినట్లు సమాచారం. సీఏఏ, ఎన్‌పీఆర్‌లతో శిరోమణి అకాళీదల్‌ బీజేపీల మధ్య విబేధాలు నెలకొనడంతో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా కేటాయించలేదు.

English summary
The Bharatiya Janata Party (BJP) on Tuesday released its final list that has its New Delhi candidate, Sunil Yadav, who is pitted against Chief Minister Arvind Kejriwal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X