వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేజ్రీవాల్ భావోద్వేగం: మీ బిడ్డలా ఆదరించారు: లవ్ యు ఢిల్లీ: హనుమంతుడికి స్పెషల్‌గా..!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది ఆమ్ఆద్మీ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో విజయాన్ని అందుకుంది. ఆమ్ఆద్మీ పార్టీ ఓ సునామీని సృష్టించింది. దీని ధాటికి భారతీయ జనతా పార్టీ గానీ, కాంగ్రెస్ గానీ ఏ మాత్రం నిలవలేకపోయాయి.. కుదేలు అయ్యాయి. మొత్తం 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ఆద్మీ పార్టీ 63 స్థానాల్లో ఆధిక్యతను కనపరుస్తోంది. బీజేపీ ఏడు చోట్ల మాత్రమే పైచేయి సాధించేలా ఉంది.

హస్తినలో హ్యాట్రిక్: సర్కార్ సామాన్యుడిదే: ఆమ్ఆద్మీ ప్రభుత్వ ఏర్పాటు లాంఛనమే..!హస్తినలో హ్యాట్రిక్: సర్కార్ సామాన్యుడిదే: ఆమ్ఆద్మీ ప్రభుత్వ ఏర్పాటు లాంఛనమే..!

బీజేపీ కాస్త పుంజుకొన్నట్టు కనిపించినా..


తొలి రౌండ్ నుంచీ ప్రత్యర్థులకు ఏ మాత్రం అవకాశాన్ని ఇవ్వలేదు ఆమ్ఆద్మీ పార్టీ. 2015 ఎన్నికలను తలపించేలా ప్రభంజనాన్ని కొనసాగించింది. మధ్య రౌండ్ల ఓట్ల లెక్కింపు సందర్భంగా బీజేపీ కాస్త పుంజుకొన్నట్లు కనిపించినప్పటికీ.. అది తాత్కాలికమే. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, సీనియర్ నాయకురాలు ఆతిషి వంటి అభ్యర్థులు తొలి రౌండ్లలో తమ ప్రత్యర్థుల కంటే వెనుకంజలో నిల్చున్నారు. చివరి రౌండ్లకు వచ్చే సరికి పైచేయి సాధించారు. విజయాన్ని అందుకోగలిగారు.

పార్టీ కార్యాలయం నుంచి పర్యవేక్షించిన కేజ్రీవాల్..

ఓట్ల లెక్కింపు సరళిని కేజ్రీవాల్ పార్టీ కార్యాలయం నుంచి పర్యవేక్షించారు. తొలి గంట పాటు తన అధికారిక నివాసంలో ఉన్న ఆయన ఆ తరువాత ఊరేగింపుగా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సహా పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు ఆయనను కలుసుకున్నారు. ఓట్ల లెక్కింపు ట్రెండ్ పార్టీకి అనుకూలంగా ఉండటంతో ఉదయం నుంచే పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తల కోలాహలం కనిపించింది.

బిడ్డలా ఆశీర్వదించారు..

ఓట్ల లెక్కింపునకు సంబంధించిన రౌండ్లు పూర్తవుతున్న కొద్దీ ఆమ్ఆద్మీ పార్టీ ఆధిక్యత పెరుగుతూనే పోయిందే తప్ప ఎక్కడా తగ్గలేదు. దీనితో మధ్యాహ్నం 3:30 గంటలకు కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తన భార్య సునీతా కేజ్రీవాల్, పార్టీ సీనియర్ నాయకుడు సంజయ్ సింగ్, ఇతర నాయకులతో కలిసి ఆయన ఢిల్లీ ప్రజలకు కృతజ్ఙతలు తెలిపారు. ఢిల్లీ ఓటర్లు తమ కన్నబిడ్దలా ఆదరించారని, ఆశీర్వదించారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు.

హనుమంతుడికి స్పెషల్ థ్యాంక్స్..

హనుమాన్‌జీకి తాను ఆ సందర్భ:గా ప్రత్యేకంగా కృతజ్ఙతలు తెలియజేస్తున్నానని కేజ్రీవాల్ అన్నారు. హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల భారీ మెజారిటీ లభించిందని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. హనుమాన్‌జీ కొ బహుత్, బహుత్ షుక్రియా.. అంటూ కేజ్రీవాల్ అన్నారు. ఎన్నికల ప్రచారం సందర్బంగా ఓ న్యూస్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో కేజ్రీవాల్.. హనుమాన్ చాలీసాను పఠించిన విషయం తెలిసిందే. దీనిపై భారతీయ జనతా పార్టీ నాయకులు విమర్శలు గుప్పించిన విషయాన్ని కేజ్రీవాల్ ప్రస్తావించారు.

English summary
Kejriwal thanked the people of Delhi for ensuring AAP’s third term in the national capital. He thanked people for trusting “their son (Arvind Kejriwal)” yet again. He had in the run-up to the polls repositioned himself as a person focussing on the welfare of the people from being a person always at loggerheads with the authorities. While AAP leads in 57 seats, with wins in six more seats, as per Election Commission data, BJP has chalked up its first win from Vishwas Nagar and is leading in six more seats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X