వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సర్జికల్ స్ట్రైక్స్2: వినూత్నంగా ఆనందాన్ని పంచుకున్న ఆటో డ్రైవర్, వివిధ దేశాల స్పందన

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడి చేసి దాదాపు మూడు వందల మంది ఉగ్రవాదులను హతం చేసింది. మన ఎయిర్ ఫోర్స్ పనిని యావత్ భారతం ప్రశంసిస్తోంది. ప్రపంచ దేశాలు కూడా ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు చేసిన ఈ దాడిని ఖండించలేదు. ఇది భారత్ విజయం.

తమ ఆనందాన్ని ప్రజలు ఒక్కొక్కరూ ఒక్కోలా పంచుకుంటున్నారు. ఢిల్లీలో మనోజ్ అనే ఆటో డ్రైవర్ కూడా తన ఆనందాన్ని వినూత్నంగా పంచుకున్నాడు. నేడు తన ఆటోలో ఎక్కిన కస్టమర్లను మంగళవారం ఉచితంగా గమ్య స్థానాలకు చేర్చాడు.

తన ఆటోకి ప్రయాణం ఉచితం అనే బోర్డు కూడా తగిలించాడు. ఈ సందర్భంగా మనోజ్ మీడియాతో మాట్లాడాడు. నా అనందాన్ని ఇంతకంటే బాగా ఎలా పంచుకోగలనని, అందుకే తన ఆటోలో ఎక్కే ప్రతి ఒక్కరినీ ఫ్రీగా తిప్పుతున్నానని, ఎవరి దగ్గరా డబ్బులు తీసుకోలేదని, పాక్‌ ఉగ్ర శిబిరాలపై భారత్ దాడులు చేయడం చాలా సంతోషంగా ఉందని, ఈ ఒక్కరోజు ఎవరి దగ్గరా డబ్బులు తీసుకోనని చెప్పాడు.

Delhi auto driver offers free rides to celebrate IAFs airstrikes in Pakistan

ఈ దాడిపై అమెరికా, రష్యా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఇండొనేషియా, టర్కీలతో పాటు మరో ఆరు దేశాలకు సర్జికల్ స్ట్రైక్స్ గురించి భారత్ వివరించింది. ఈ దేశాలకు చెందిన రాయబారులతో విదేశాంగశాఖ కార్యదర్శి విజయ్ గోఖలే భేటీ అయ్యారు. దాడులు చేయడానికి గల కారణాలను వారికి వివరించారు.

ఆస్ట్రేలియా స్పందిస్తూ.. తమ గడ్డపై నుంచి పని చేస్తున్న జైష్, లష్కర్ ఏ తాయిబాతో పాటు అన్ని టెర్రరిస్టు గ్రూపులపై తక్షణమే పాకిస్థాన్ చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించింది. డొమినికన్ రిపబ్లిక్ కు చెందిన అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. తమ దేశాధినేతకు భారత వాయుసేన దాడులకు సంబంధించి అన్ని వివరాలను అందించామని, బాధ్యతాయుతంగా భారత్ వ్యవహరించిందని, పాకిస్తాన్ సైన్యానికి కానీ, పాక్ ప్రజలకు కానీ చిన్న హాని కూడా కలగకుండా భారత్ వ్యవహరించిందని కితాబిచ్చారని తెలిపారు. ఉగ్రవాదాన్ని అంతమొందించి, ఉపఖండంలో శాంతిని నెలకొల్పే దిశగా ఇరు దేశాలు దౌత్యపరంగా సమస్యని పరిష్కరించుకోవాలని బ్రిటన్ సూచించింది.

English summary
An auto driver Manoj offered free rides today in celebration of Indian strikes on JeM camp in Balakot. He says, 'Can't do much but I'm offering free rides. I'm happy, I'm not charging anything today.'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X