వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా కలకలం: ఆయుష్మాన్ భారత్ కార్యాలయానికి తాళం పడింది!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కరోనావైరస్ కారణంగా నేషనల్ హెల్త్ అథారిటీ ఆఫీసు(ఆయుష్మాన్ భారత్) మూతపడింది. ఆయుష్మాన్ భారత్ కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని తేలడంతో అధికారులు ఢిల్లీలోని సదరు కార్యాలయాన్ని మూసివేశారు.
మిగితా ఉద్యోగులంతా సెల్ఫ్ క్వారంటైన్‌కు వెళ్లినట్లు తెలిసింది.

ఆయూష్మాన్ భారత్ లబ్ధిదారులకు ప్రైవేటు ల్యాబ్‌లలో ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తుండగా, ఎన్‌రోల్ అయిన ఆస్పత్రుల్లో ఉచితంగా కరోనా చికిత్స అందిస్తున్నారు. ఏప్రిల్ ప్రారంభంలోనే ఇందుకు సంబంధించిన ఆదేశాలను నేషనల్ హెల్త్ అథారిటీ ప్రకటించింది. కరోనాపై పోరోటాన్ని ఇది బలోపేతం చేస్తుందని స్పష్టం చేసింది.

 Delhi: Ayushman Bharat office sealed after employee tests positive for coronavirus

దేశంలోని పేదలకు ఉచిత వైద్య సౌకర్యం అందించడం కోసం ఆయుష్మాన్ భారత్
ప్రధానమంత్రి జనఆరోగ్య యోజన(ఏబీపీఎంజేఏవై)ను 2018 సెప్టెంబర్‌లో ప్రారంభించిన విషయం తెలిసిందే. దేశంలోని దాదాపు 50 కోట్ల మంది ప్రజలు ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి వచ్చారు. ఇందులో భాగంగా ఒక్కో కుటుంబానికి ఏటా రూ. 5లక్షల వరకు బీమా వర్తిస్తుంది.

దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కేసులు

దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1553 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 36 మరణాలు సంభవించాయని కేంద్ర వైద్యారోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 2546 మంది కోలుకున్నారని, మొత్తం కేసుల్లో ఇది 14.75శాతమని చెప్పారు.

కరోనా కేసులు రెట్టింపు అవడానికి పడుతున్న వేగం భారతదేశంలో నెమ్మదించిందని, లాక్‌డౌన్‌కు ముందు 3.4 రోజులకోసారి కేసులు రెట్టింపు కాగా, ప్రస్తుతం అది 7.5 రోజులకు చేరిందని అగర్వాల్ తెలిపారు. దేశంలో కరోనా మహమ్మారి కేసుల రెట్టింపు వేగం తగ్గుముఖం పట్టడం ఊరటనిచ్చే విషయమని అన్నారు. కేరళ, కర్ణాటకలో ఈ రెట్టింపు వేగం బాగా తగ్గిందని తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో ఈ రెట్టింపు రేటు జాతీయ సగటుతో పోలిస్తే తక్కువ ఉందని వెల్లడించారు. జాతీయ స్థాయిలో 7.5 రోజులకు రెట్టింపు అవుతుండగా ఏపీలో 10.6 రోజులకు, తెలంగాణలో 9.4 రోజులకు డబుల్ అవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ రేటు 8.5 రోజులుగా ఉందని, ఒడిశాలో 39.8 రోజులుగా ఉందని తెలిపారు. కేరళలో 72.2 రోజులుగా ఉందని తెలిపారు. జాతీయ సగటుతో పోల్చినప్పుడు మొత్తం 18 రాష్ట్రాలు ఈ విషయంలో మెరుగ్గా ఉన్నాయని తెలిపారు.

English summary
The office of the National Health Authority, the nodal agency for Ayushman Bharat Pradhan Mantri Jan Arogya Yojana (PM-JAY), was sealed in Delhi after one of the employees tested positive for coronavirus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X