వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ పార్టీ ఆఫీస్ లో భార్యను చితకబాదిన బీజేపీ లీడర్, వీడియో వైరల్, కేంద్ర మంత్రి!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లో త్వరలో జరగనున్న ఎన్నికల గురించి చర్చిస్తున్న సమయంలో అదే కార్యాలయంలోకి వచ్చిన భార్యను చూసిన బీజేపీ నేత ఊగిపోయాడు. అంతే నువ్వ ఎందుకు వచ్చావ్ ? అంటూ ఆమెను పట్టుకుని బీజేపీ నాయకుడు చితకబాదేశాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ కావడంతో బీజేపీ నేత చిక్కుల్లో పడిపోయాడు.

నిన్న విలన్ ప్రభుత్వం, నేడు హీరో ప్రభుత్వం, టైం పాస్ సీఎం, పెత్తనం, బీజేపీ చీఫ్!నిన్న విలన్ ప్రభుత్వం, నేడు హీరో ప్రభుత్వం, టైం పాస్ సీఎం, పెత్తనం, బీజేపీ చీఫ్!

ఢిల్లీలో ఎన్నికల హడావిడి ఎక్కువ అయ్యింది. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో గురువారం కేంద్ర మంత్రి ప్రకాష్ జావదేకర్ అధ్యక్షతన బీజేపీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఇదే కార్యక్రమానికి ఢిల్లీలోని మెహ్రోలి జిల్లా బీజేపీ అధ్యక్షుడు అజాద్ సింగ్ హాజరైనాడు.

Delhi BJP leader Azad Singh slaps wife in Party office.

అజాద్ సింగ్ సభలో ఉన్న సమయంలో ఆయన మొదటి భార్య సరితా చౌదరి సైతం ఆ సమావేశానికి హాజరైనారు. సరితా చౌదరిని చూసిన వెంటనే ఆజాద్ సింగ్ ఊగిపోయాడు. నిన్ను ఎవ్వరు రమ్మన్నారు, ఇక్కడికి వచ్చి నా పరువు తీస్తావా అంటూ ఆజాద్ సింగ్ రెచ్చిపోయాడు.

తోక ముడిచిన పాక్: భారత్ దెబ్బకు ఉగ్రవాదులు పరుగో పరుగు, వైరల్ వీడియో!తోక ముడిచిన పాక్: భారత్ దెబ్బకు ఉగ్రవాదులు పరుగో పరుగు, వైరల్ వీడియో!

సరితా చౌదరి మీద ఆజాద్ సింగ్ చెయ్యి చేసుకుని ఆమెను ఇష్టం వచ్చినట్లు దాడి చేశాడు. అక్కడ ఉన్న వాళ్లు ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది. షాక్ కు గురైన బీజేపీ నాయకులు ఆజాద్ సింగ్ ను దక్షిణ ఢిల్లీ మెహ్రోలి జిల్లా అధ్యక్ష పదవి నుంచి ఆయన్ను తప్పించి ఆ పదవిలో వికాస్ తన్వార్ ను నియమించారు.

కొంత కాలంగా ఆజాద్ సింగ్, సరితా చౌదరి దంపతుల కాపురంలో చిచ్చురేగిందని, విడాకుల కోసం ఇద్దరూ కోర్టును ఆశ్రయించారని సమాచారం. ఆజాద్ సింగ్ భార్య సరితా చౌదరి ఢిల్లీ మాజీ మేయర్. సరితా చౌదరి మీద దాడి చేసిన సమయంలో కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ అక్కడే ఉన్నారని, అందుకే ఆయన్ను బీజేపీ నుంచి తప్పించారని సమాచారం.

English summary
Delhi BJP leader Azad Singh slaps wife in Party office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X