• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తమ్ముడిరూప రాక్షసుడు.. చెప్పకుండా అక్క షాపింగ్ చేసిందని గోర్లతో కంటిపై దాడి...

|

న్యూఢిల్లీ : మరో రెండురోజుల్లో రాఖీ పౌర్ణమి. అక్కాతమ్ముడు, అన్నాచెల్లెళ్ల పవిత్రబంధానికి ప్రతీరూపం. సోదర, సోదరీల బంధానికి ప్రతీక. కానీ ఢిల్లీలో ఓ యువకుడు తన సోదరి పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. రాఖీ పండగా రెండురోజుల ముందు .. ఆమె కనుగుడ్లు పీకేందుకు ప్రయత్నించాడు. ఈ అమానుష ఘటన ఢిల్లీ మహిళా కమిషన్ సభ్యుల వల్ల వెలుగచూసింది.

రాఖీ పౌర్ణమికి ముందు ..

రాఖీ పౌర్ణమికి ముందు ..

బీహర్‌కు చెందిన యువతి, తమ్ముడు, చెల్లెళ్లతో కలిసి ఢిల్లీలోని ద్వారకాలో ఉంటున్నారు. అయితే సోదరిపై తమ్ముడు ఎప్పుడూ గొడవపడుతూనే ఉంటారు. వివిధ అంశాలపై వీరి మధ్య తరచూ గొడవ జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో మంగళవారం యువతి రూ. వందతో ఒక డ్రెస్ కొనుగోలు చేసింది. ఇదే ఆమె చూపు కోల్పేయేందుకు దారితీసింది. వెంటనే ఇంటికొచ్చింది. ఇదేంటని తమ్ముడు అడగడంతో డ్రెస్ అని చెప్పడంతో వారి మధ్య ఘర్షణ జరిగింది.

డ్రెస్ కొన్న పాపానికి ..

డ్రెస్ కొన్న పాపానికి ..

ఆ డ్రెస్ ఎందుకు కొన్నవని అడగడం వాదనలకు దారితీసింది. మాట మాట పెరిగింది. వెంటనే యువతి కనుగుడ్లపై గోళ్లతో దాడిచేశాడు. ఆమె గట్టిగా అరవడంతో గదిలో వేశాడు. అయితే రోజువారీ పర్యటనలో భాగంగా మహిళా కమిషన్ సభ్యులు పర్యటిస్తున్నారు. ఇంతలో యువతికి జరిగిన ఘటన గురించి తెలుసుకున్నారు. ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా తమ్ముడు రూపంలో ఉన్న రాక్షసుడు అడ్డుకున్నాడు. మహిళ కమిషన్ సభ్యులను దూషించాడు. కొడతానని బెదిరించిన వారు అదరలేదు, బెదరలేదు. ఇంట్లోకి వెళ్లి .. తీవ్ర గాయాలతో ఉన్న యువతిని పలకరించారు. వెంటనే ఆమెను సఫ్తార్ గంజ్ ఆస్పత్రికి తరలించారు.

సోదర రూప రాక్షసుడు ..

సోదర రూప రాక్షసుడు ..

రాఖీ పండుగకు ముందు ఓ సోదరుడు ఎలాంటి బహుమతి ఇచ్చాడో చూడండి అని ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలను మహిళా కమిషన్ సభ్యులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆమె చూపు కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఆ యువకుడు సోదరితో ఎప్పుడూ అలాగే ప్రవర్తిస్తాడని ఇరుగు పొరుగు వారు చెప్తున్నారు. అక్కాచెల్లెళ్లను తరచూ కొడతాడని తెలిపారు. యువతిపై దాడికి సంబంధించి సమాచారం బీహర్‌లో ఉంటున్న వారి పేరెంట్స్‌కు సమాచారం అందించారు. యువతికి చికిత్స పూర్తయ్యాక వారు ఆమెను బీహర్ తీసుకెళాతామని చెప్పినట్టు తెలుస్తోంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
17-year-old boy in Delhi attacked his elder sister as he was angered after she purchased a dress worth Rs 100. The boy tortured his sister and gouged out her eyes, the Delhi Commission of Women (DCW) has said. The family hails from Bihar and lives near Dwarka in Delhi. The 20-year-old victim was rescued by DCW on Tuesday during a routine visit to the area. The boy's brutality was discovered when members of DCW's mahila panchayat heard the girl's cries during their door-to-door visit in the locality. When they enquired about it, neighbours informed them that the boy often abuses and beats up his sisters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more