వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హీరో కమల్ హాసన్ బహిరంగ సభ, ముగ్గురు సీఎంలు, పార్టీ పేరు, సిద్దాంతాలు, సవాల్!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Kamal Haasan To Launch Political Outfit Tomorrow

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పాలని ప్రయత్నిస్తున్న హీరో కమల్ హాసన్ బుధవారం తన సొంత పార్టీ పేరు, పార్టీ సిద్దాంతాలు వెల్లడించడానికి వేదిక సిద్దం అయ్యింది. బుధవారం మదురైలో జరిగే కమల్ హాసన్ బహిరంగ సభకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేరళ సీఎం విజయన్ పినరయితో సహ వామపక్ష పార్టీలకు చెందిన అనేక మంది నాయకులు హాజరై ఆయన్ను ఆశీర్వదించనున్నారు.

ఇంటికి ఆహ్వానం

ఇంటికి ఆహ్వానం

తాను రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించిన హీరో కమల్ హాసన్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను చెన్నైలోని అళ్వార్ పేటలోని తన ఇంటికి ఆహ్వానించి విందు ఇచ్చారు. అనంతరం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో రాజకీయాలపై కమల్ హాసన్ సుదీర్ఘంగా చర్చించి పలు సూచనలు సలహాలు తీసుకున్నారు.

మేడమ్ అభిమాని

మేడమ్ అభిమాని

సినీ కార్యక్రమంలో భాగంగా కోల్ కతా వెళ్లిన కమల్ హాసన్ పచ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. అనంతరం రాజకీయాలపై మమతా బెనర్జీతో కమల్ హాసన్ సుదీర్ఘంగా చర్చించారు. తాను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వీరాభిమాని అని కమల్ హాసన్ అప్పట్లో మీడియాకు చెప్పారు.

గురువు ఆశీర్వాదం

గురువు ఆశీర్వాదం

హీరో కమల్ హాసన్ ఇటీవల కేరళ ముఖ్యమంత్రి విజయన్ పినరయి ఇంటికి వెళ్లి ఆయనతో అనేక విషయాలపై చర్చించారు. తనకు రాజకీయాల్లో ఎలా ముందుకు వెళ్లాలి అనే విషయంలో కేరళ సీఎం విజయన్ పినరయి నుంచి సూచనలు సలహాలు తీసుకుంటానని, ఆయన తనకు గురువులాంటివారని హీర్ కమల్ హాసన్ అన్నారు.

 ఎంజీఆర్, జయ, క్యాప్టెన్

ఎంజీఆర్, జయ, క్యాప్టెన్

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రులు ఎంజీ రామచంద్రన్, జయలలిత, డీఎండీకే పార్టీ వ్యవస్థాపకుడు క్యాప్టెన్ విజయ్ కాంత్ వారి రాజకీయ జీవితాలను మదురై నుంచి ప్రారంభించారు. ఇప్పుడు అదే బాటలో హీరో కమల్ హాసన్ నడుస్తున్నారు.

 రామేశ్వరం టూ మదురై

రామేశ్వరం టూ మదురై

బుధవారం ఉదయం హీరో కమల్ హాసన్ రామేశ్వరంలోని రామనాథపురంలో భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలామ్ సమాధి దగ్గర నివాళులు అర్పించనున్నారు. అనంతరం కలామ్ ఇంటి నుంచి కమల్ హాసన్ తన రాజకీయ తొలి అడుగు వెయ్యనున్నారు. రామనాథపురం, పరమకుడి మీదుగా మదురై చేరుకుంటున్నారు.

ఆసక్తిగా ఎదురు చూపు

ఆసక్తిగా ఎదురు చూపు

హీరో కమల్ హాసన్ మదురైలో జరిగే బహిరంగ సభలో తన రాజకీయ పార్టీ పేరు, సిద్దాంతాలను ప్రకటించనున్నారు. హీరో కమల్ హాసన్ తన పార్టీ పేరే ఏమి పెట్టారని, వామపక్షాలకు అనుకూలంగా కమల్ మాసన్ పార్టీ సిద్దాంతాలు ఉంటాయా అనే చర్చ ఇప్పుడు మొదలైయ్యింది.

 పొరుగు రాష్ట్రం సీఎం

పొరుగు రాష్ట్రం సీఎం

హీరో కమల్ హాసన్ తన పార్టీ పేరును ప్రకటించే బహిరంగ సభకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఆహ్వానించారు. అయితే తనకు రాజకీయ గురువు అని చెప్పిన పొరుగు రాష్ట్రం కేరళ సీఎం విజయన్ పినరయిని ఆహ్వానించారా ? లేదా ? అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదని ఆయన అభిమాన సంఘాల నాయకులు అంటున్నారు.

English summary
Delhi Chief minister Aravind Kejriwal will participate in the Kamal haasan's first political meet at Madurai in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X