వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

delhi clashes: అమిత్ షా రాజీనామా చేయాలని సోనియాగాంధీ డిమాండ్

|
Google Oneindia TeluguNews

ఈశాన్య ఢిల్లీలో జరుగుతోన్న ఆందోళనలకు కేంద్ర హోంమంత్రి బాధ్యత వహించాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అన్నారు. 20 మంది మరణానికి, పదుల సంఖ్యలో గాయపడేందుకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. శాంతి భద్రతల బాధ్యత హోంశాఖదని.. మరి ఆ శాఖ మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆ పార్టీ నేత రెచ్చగొట్టే ప్రసంగం చేస్తుంటే మిన్నకుండిపోయారా అని ప్రశ్నించారు.

ఈశాన్య ఢిల్లీలో అల్లర్ల బాధాకరమని సోనియాగాంధీ అన్నారు. కానీ ఘటనకు హోం మంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. శనివారం నుంచి ఆందోళనలు జరుగుతోన్న పోలీసు శాఖ ఏం చేస్తుందని ఆమె ప్రశ్నించారు.

delhi clashes: Amit Shah should resign sonia gandhi

నిఘా విభాగం ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయలేదని అడిగారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోపాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా నైతిక బాధ్యత వహించాలని సోనియాగాంధీ అన్నారు. ఆందోళనలు జరుగుతోన్న అదుపులోకి తీసుకొచ్చేందుకు సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఢిల్లీలో పరిస్థితి దిగజారేందుకు గల కారణాలు ఏంటీ అని ఆరు ప్రశ్నలను సంధించారు.

Recommended Video

3 Minutes 10 Headlines | GISAT-1 Launch | North-East Delhi | Oneindia Telugu

ఢిల్లీ ఘర్షణలో మృతుల సంఖ్య 20కి చేరింది. మంగళవారం వరకు 13 మంది చనిపోగా.. బుధవారం మరో ఏడుగురు చనిపోయారు. జీటీబీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు మృతిచెందారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మరోవైపు కేంద్ర మంత్రివర్గానికి ఢిల్లీ పరిస్థితిని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వివరించనున్నారు.

English summary
Congress president Sonia Gandhi asked Home Minister Amit Shah to resign in the wake of three days of violence in northeast Delhi that have killed 20.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X